మాట్లాడుతున్న రూప రఘునాథ స్వామి
ప్రొద్దుటూరు టౌన్, జనవరి 16: ఆధ్యాత్మిక చింతనతో ఉత్తమ, ప్ర శాంత జీవనం గడపవచ్చని రూప రఘునాథ స్వామి పేర్కొన్నారు. ప్ర పంచ పర్యటనలో భాగంగా అర్జెంటీనాకు చెందిన రూప రఘునాథ స్వా మి ఆదివారం ఇస్కాన్ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాలు తిరిగానన్నా రు. 1974లో ఇండియాకు వచ్చి ఆధ్యాత్మిక ప్రశాంతతకోసం ఏడేళ్లు వివిధ ప్రాంతాలు తిరిగి శివ, రామ భక్తులు, సాధువులు, బుద్ధిస్టులతో గడిపానన్నారు. స్పెయిన్‌లో ఇస్కాన్ వ్యవసాయ క్షేత్రంలో చేరి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. భారతీయ యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరించవద్దని సూచించారు.