క్వారంటైన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-11T11:34:05+05:30 IST

చిన్నమండెం ఆదర్శ పాఠశాలలో ఆదివారం క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బాలమునెయ్య, ఎంఈఓ శివనాయక్‌ మాజీ ..

క్వారంటైన్‌ ప్రారంభం

చిన్నమండెం, మే 10: చిన్నమండెం ఆదర్శ పాఠశాలలో ఆదివారం క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బాలమునెయ్య, ఎంఈఓ శివనాయక్‌ మాజీ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ దేవనాధరెడ్డిలు క్వారెంటెన్‌ పరిశీలించారు. బెంగళూరు నుంచి ఒడిశాకు సైకిళ్లపై వెళుతున్న  ఏడుగురిని కేశాపురం చెక్‌ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకొని కడప క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిందే. చిన్నమండెంలో క్వారంటైన్‌ ప్రారంభం కాగానే ఈ ఏడుగురిని ఇక్కడి క్వారంటైన్‌కు తరలించారు. కాగా బెంగళూరు నుంచి కనిగిరి వెళుతున్న ముగ్గురిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు.

Updated Date - 2020-05-11T11:34:05+05:30 IST