నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు
కాశీబుగ్గ: గుజరాత్‌లోని మత మారణ హోమానికి బలైన బాధితుల పక్షాన పోరాడిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టును చేయడం అన్యాయమని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈ మేరకు సోమవారం కాశీబుగ్గ అంబేడ్కర్ విగ్రహం ఎదుట సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు మాధవరావు, సీసీఎం నాయకులు గణపతి ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు రామారావు, సుందర్‌లాల్, ఆనంద్, మురళి పాల్గొన్నారు.