అన్ని దిశల్లో వేదనాదం ప్రతిధ్వనించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:25:17+05:30 IST

అన్ని దిశల్లో వేదనాదం ప్రతిధ్వనించాలి

అన్ని దిశల్లో వేదనాదం ప్రతిధ్వనించాలి
వేదపాఠశాల ప్రారంభోత్సవంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానదేంద్రస్వామి


మోమిన్‌పేట, మే23: వేద ప్రాంతంలో అన్ని దిశల్లో వేద నాదం ప్రతిధ్వనించాలని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ అన్నారు. మోమిన్‌పేట మండలం కేసారంలో సోమవారం ఆయన వేద పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలను నెలకొల్పిన పీఎం శర్మను ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి అభినందించి మాట్లాడారు. వేదహిత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేద పాఠశాలను గ్రామంలో నెలకొల్పిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పీఎం శర్మ గొప్ప వ్యక్తి అన్నారు. శర్మ మాట్లాడుతూ వేద పాఠశాలను నెలకొల్పి ఉచితంగా వేదాల బోధన చేయాలనే సంకల్పంతోనే వేద పాఠశాలను నెలకొల్పానని అన్నారు. నా గురువు ఆశీస్సులతో ఇంత దూరం వచ్చి వారి చేతుల మీదుగా వేద పాఠశాలను ప్రారంభింపజేయడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.  ఈ ప్రాంతాన్ని వేద నిలయంగా మార్చేందుకు తమ గురుదేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో స్వాత్మానందేంద్ర, పండితులు, జెడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ గిరిచంద్రకళ, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:25:17+05:30 IST