పోలీస్‌ ఉద్యోగాల నియామకానికి వయోపరిమితి ఐదు సంవత్సరాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-05-19T06:27:00+05:30 IST

పోలీసు, ఇతర యూనిఫామ్‌ ఉద్యోగుల రిక్రుట్‌మెంట్‌లో వయో పరిమితి ఐదు సంవత్సరాలకు పెంచాలని బీజేవైఎం జోనల్‌ ఇనచార్జి పట్నం కపిల్‌ డిమాండ్‌చేశారు.

పోలీస్‌ ఉద్యోగాల నియామకానికి  వయోపరిమితి ఐదు సంవత్సరాలు పెంచాలి
కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారికి వినతి పత్రం అందచేస్తున్న బీజేవైఎం నాయకులు

భువనగిరి రూరల్‌, మే18: పోలీసు, ఇతర యూనిఫామ్‌ ఉద్యోగుల రిక్రుట్‌మెంట్‌లో వయో పరిమితి ఐదు సంవత్సరాలకు పెంచాలని బీజేవైఎం జోనల్‌ ఇనచార్జి పట్నం కపిల్‌ డిమాండ్‌చేశారు. కలెక్టరేట్‌ ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల ఎదురు చూపు తర్వాత ఉద్యోగ నోటీఫికేషన్లు వెలువడుతున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది యువతీ యువకుల వయోపరిమితి దాటిపోయి, ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నియామకాలు, నిధులు నినాదాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లలో మార్పులు చేసి ఐదేండ్ల వరకు వయోపరిమితి సడలించాలని, లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కె.ప్రశాంత, వాస నర్సింగ్‌, వినయ్‌, మంగు నర్సింహ, మణికంఠ, కిరణ్‌, మహేశ ఉన్నారు. 


Updated Date - 2022-05-19T06:27:00+05:30 IST