Abn logo
Oct 20 2021 @ 22:56PM

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన సినీనటుడు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన సినీనటుడు నారాయణమూర్తి

చేర్యాల, అక్టోబరు 20 : సినీనటుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగామలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా తాను నిర్మించిన ‘రైతన్న’ సినిమాను వీక్షించాలని కోరారు. రైతులకు కష్టాలే మిగులుతున్నాయని వివరిస్తూ సినిమాను తీశానని తెలిపారు. ఈనెల 23న జనగామలో సినిమా చూస్తానని, పార్టీ శ్రేణులను కూడా విజయవంతం చేయాలని సూచిస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హామీఇచ్చారు.