Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 20 Jan 2022 21:20:50 IST

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

తన పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండాలని పట్టుబట్టి మరీ ప్రేమికుల రోజునే మూహూర్తం పెట్టించుకున్నాడు. కాబోయే భార్యతో రోజూ మాట్లాడుతూ సంతోషంగా గడుపుతున్నాడు. ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు. తను అనుకున్నది నెరవేర్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు ఓ రోజు టీవీ చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత అతడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.

ఢిల్లీ లాహోరీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మహ్మద్ జైద్.. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో నెలకు రూ.8000 జీతంతో పని చేస్తున్నాడు. ఇటీవల ఇతడికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఇరు కుటుంబాలకు నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే తన వివాహం జీవితాంతం గుర్తుండాలని ప్రేమికుల రోజు( ఫిబ్రవరి 14)నే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. పెళ్లికి రోజులు దగ్గరపడుతుండడంతో మహ్మద్ కుటుంబ సభ్యులు.. పెళ్లి పనుల్లో పడ్డారు. మహ్మద్ జేబులో మాత్రం చిల్లి గవ్వ లేదు. దీంతో పెళ్లి సమయంలో ఖర్చుల గురించి ఆలోచించసాగాడు. వివాహం అనంతరం భార్యను బాగా చూసుకోవడానికి ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..

ఈ క్రమంలో ఓ రోజు టీవీలో క్రైమ్ వార్తలు చూసి పక్కా స్కెచ్ వేసుకున్నాడు. నగరంలోని ఓ ఇంటిని టార్గెట్ చేశాడు. ఈ నెల 18వ తేదీన ఆ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించి.. నగలు, నగదు, ఫోన్లను చోరీ చేశాడు. ఇంటికి వచ్చిన యజమానులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రూ.2.15లక్షల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

డబ్బుల కోసం ఔత్సాహిక దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం.. ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు.. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది.. video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.