ఆ కేసును కొట్టేయాలి: సీనియర్‌ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2022-07-05T23:11:29+05:30 IST

అమరావతి: తన‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు నమోదు చేసి 15 నెలలు అవుతుందని

ఆ కేసును కొట్టేయాలి: సీనియర్‌ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: తన‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటీషన్‌ను హైకోర్టు  విచారణకు స్వీకరించింది. కేసు నమోదు చేసి 15 నెలలు అవుతుందని వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు కోర్టుకు తెలిపారు. కనీసం చార్జ్‌షీటు కూడా దాఖలు చేయలేదని చెప్పారు. దీంతో కేసు దర్యాప్తు వివరాలు తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ వేసేందుకు నాలుగు వారాలు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. జడ్జి రెండు వారాల సమయం మాత్రమే ఇస్తూ.. జూలై 19వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు.


తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు

నిఘా విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని, ఒక్క పైసా కూడా ఎవరికి చెల్లించ‌లేదని  పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం పొందకుండానే సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారని, తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్లో పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-05T23:11:29+05:30 IST