మెదడును తినేసే అమీబా... ఆ నీళ్ళను వాడొద్దు...

ABN , First Publish Date - 2020-09-27T20:57:21+05:30 IST

ఆ నీటిని వాడొద్దు... లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలకు అధికారులు చేసిన విజ్ఞప్తి ఇది. మెదడును తినివేసే నేగ్లెరియా ఫోలరీ అనే ప్రాణాంతక సూక్ష్మజీవులతో ఈ నీరు కలుషితమైందన్న అనుమానాల నేపథ్యంలో కుళాయిల నీటిని వాడొద్దంటూ ఈ సూచన చేశారు.

మెదడును తినేసే అమీబా... ఆ నీళ్ళను వాడొద్దు...

ఆస్టిన్ : ఆ నీటిని వాడొద్దు... లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలకు అధికారులు చేసిన విజ్ఞప్తి ఇది. మెదడును తినివేసే నేగ్లెరియా ఫోలరీ అనే ప్రాణాంతక సూక్ష్మజీవులతో ఈ నీరు కలుషితమైందన్న అనుమానాల నేపథ్యంలో కుళాయిల నీటిని వాడొద్దంటూ ఈ సూచన చేశారు.


దాదాపు 27 వేల మంది ప్రజలు నివసించే లేక్ జాన్సన్ ప్రాంతంలో సరఫరా అవుతోన్న మంచినీరు 'నేగ్లెరియా ఫోలరీ' అనే ఒక రకం అమీబాతో కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


ఈ అమీబాతో కలుషితమైన నీరు... ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు అవి ప్రాణాంతకంగా మారుతాయని చెబుతున్నారు. అమెరికాలో ఈ రకం అమీబా సోకడం అరుదే. కాగా... 2009, 2018 మధ్య కాలంలో 34 వరకు ఇలాంటి కేసులను గుర్తించారు.


టాయిలెట్ ఫ్లష్ చేయడానికి తప్ప దేనికీ డొద్దు...  టెక్సస్‌లోని ఎనిమిది ప్రాంతాలకు అధికారులు మొదట ఈ హెచ్చరికలు జారీ చేశారు. కేవలం టాయిలెట్‌లను ఫ్లష్ చేయడానికి తప్ప ఆ నీటిని ఇంక దేనికీ వాడొద్దని అధికారులు హెచ్చరించారు. అయితే ఆ తర్వాత... శనివారం సాయంత్రానికి ఈ హెచ్చరికలను కేవలం లేక్ జాక్సన్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన ప్రాంతాలవారు ఆ నీటిని వాడుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


ప్రస్తుతం సరఫరా అయిన నీటిని తతొలగించే వరకు, కొత్త నీటి నమూనాలను పరీక్షించి సురక్షితం అని తేల్చేవరకూ ఎవరూ ఆ నీటిని వాడొద్దని 'టెక్సస్ కమిషన్ ఆఫ్ ఎన్విరానమెంటల్ క్వాలిటీ' హెచ్చరించింది. అయితే ఈ ప్రక్రియ జరిగేందుకు ఎంతకాలం పడుతుందన్న విషయమై అప్పుడే స్పందించలేమని వెల్లడించింది. 


ఏమిటీ నేగ్లెరియా ఫోలరీ ?... నేగ్లెరియా ఫోలరీ అనే  అమీబా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో గతంలో ఈ అమీబా సోకిన కేసులను గుర్తించారు. 'ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)’ ఈ వివరలను వెల్లడించింది. అయితే... కలుషిత నీటిని తాగినంత మాత్రాన ఇది సోకదని, అలాగే ఒకరి నుంచి మరొకరికి ఇది సోకదని సీడీసీ వెల్లడించింది. ఇది సోకిన వారిలో జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేసినట్లు ఉండడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకిన తరువాత సరైన చికిత్స అందకపోతే వారం రోజుల్లో ప్రాణాపాయ పరిస్థితులేర్పడతాయని సీడీసీ పేర్కొంది.


ఈ ఏడాది... ఇంతవరకు ఫ్లోరిడాలో ఒక కేసు నిర్ధారణైంది. దీంతో... అప్రమత్తమైన అధికారులు... నీరు శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. 

Updated Date - 2020-09-27T20:57:21+05:30 IST