హీరోగా ప్రశంసలు అందుకుంటున్న డెలివరీ బాయ్.. ఎందుకో తెలుసా..

ABN , First Publish Date - 2022-07-04T03:26:15+05:30 IST

‘ డెలివరీ బాయ్స్ ’(delivery boy) అంటే నిమిషాల్లో సర్వీసులు అందించడమే కాదు. ఆపదలో ఉన్నవారిపట్ల మానవత్వంతో వ్యవహరిస్తామని ఓ యువకుడు చాటిచెప్పాడు.

హీరోగా ప్రశంసలు అందుకుంటున్న డెలివరీ బాయ్.. ఎందుకో తెలుసా..

థానే : ‘ డెలివరీ బాయ్స్ ’(delivery boy) అంటే నిమిషాల్లో సర్వీసులు అందించడమే కాదు. ఆపదలో ఉన్నవారిపట్ల మానవత్వంతో వ్యవహరిస్తామని ఓ యువకుడు చాటిచెప్పాడు. తీవ్రంగా గాయపడిన బాలికట(Girl) వద్దకు వైద్యులు చేరేవరకు అక్కడే ఉండి ప్రాణాపాయాన్ని తప్పించాడు. మహారాష్ట్ర(Maharastra)లోని థానే(Thane)లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ బాలిక స్కూల్ గేటు వద్ద ఆడుకుంటుండగా ఊహించని ప్రమాదం జరిగింది. ఐరన్ గేటుకున్న పదునైన కడ్డీ బాలిక బుగ్గపై దిగబడింది. కుడి కంటికి ఇంచు దూరంలో లోతుగా గుచ్చుకుని చిన్నారి విలవిల్లాడింది. బాలిక బాధను గుర్తించిన అమెజాన్ డెలివరీ పర్సన్ రవి ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు. తీవ్ర రక్తస్రావమయ్యే ప్రమాదం ఉండడంతో బుగ్గపై గుచ్చుకున్న కడ్డీని అలాగే పట్టుకుని ఉన్నాడు. అరగంటపాటు బాలిక ఎటూ కదలకుండా అలాగే పట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత సమీపంలోని వసంత విహార్ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్, నర్సు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గేటుకున్న ఐరన్ కడ్డీని కట్ చేసి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాడ్డుని తొలగించి చికిత్స అందించారు. దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది.


అరగంటపాటు సమయం కేటాయించి డెలివరీ బాయ్ రవి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. సమయానుగుణంగా స్పందించి బాలిక ప్రాణాలను రక్షించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. రవి మెచ్చుకోవాలనుకున్న కాంటాక్ట్ చేసేందుకు ఓ ఫోన్ నంబర్‌ని కూడా ట్విటర్‌లో చేశారు. దీంతో అనేక మంది రవి సాయాన్ని పొగుడుతున్నారు. బాలికకు సాయం చేయడమే కాదు.. మానవత్వాన్ని కూడా నిలిపారని మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2022-07-04T03:26:15+05:30 IST