తిమింగలం వాంతి ఖరీదు రూ. 1.90కోట్లు !

ABN , First Publish Date - 2021-03-03T20:14:24+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం.

తిమింగలం వాంతి ఖరీదు రూ. 1.90కోట్లు !

బ్యాంకాక్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. థాయ్‌లాండ్ మహిళ విషయంలో ఇదే జరిగింది. సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆమెకు ఒడ్డున ఓ వింత వస్తువు కనిపించింది. చుడ్డానికి ఎంతో వికారంగా ఉన్న ఆ వస్తువును ఆమె వద్దనుకుంటునే ఇంటికి పట్టుకొచ్చింది. అలా అయిష్టంగా తీసుకొచ్చిన ఆ వస్తువు తీరా చూస్తే కోట్లు పలుకుతుందని తెలిసింది. అంతే.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతకు ఆ వికారమైన వస్తువు ఎంటో చెప్పలేదు కదూ. అది ఓ తిమింగలం వాంతి. దాని విలువ 2.50లక్షల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.90కోట్లు). వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) అనే మహిళ ఈ నెల 23న తన ఇంటి సమీపంలో ఉండే నాఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్ బీచ్‌కు సరదాగా వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు బీచ్ ఒడ్డున ఓ వింత వస్తువు కనిపించింది. 


చుడ్డానికి ఎంతో వికారంగా ఉంది. కొద్దిసేపు దాన్ని అలా చూస్తు ఉండిపోయిన నియామ్రిన్ అయిష్టంగానే చేతుల్లోకి తీసుకుంది. దాని నుంచి సాధారణంగా చేప నుంచి వచ్చే ఏదో వాసన వస్తోంది. దాంతో ఆమె ఈ వస్తువుకు ఎంతోకొంత డబ్బు రావొచ్చని ఇంటికి పట్టుకొచ్చింది. ఆ తర్వాత తమ చుట్టుపక్కల వారికి దానిని చూపించింది. దాంతో ఆమెకు అసలు విషయం తెలిసింది. అది కోట్లు విలువ చేసే తిమింగలం వాంతి అని. దానిని సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారని. నియామ్రిన్‌కు దొరికిన తిమింగలం వాంతి 24 ఇంచుల పొడువు, 12 ఇంచుల వెడల్పుతో సుమారు 7 కిలోల బరువు ఉంది. స్థానికంగా ఉండే కౌన్సిల్ సభ్యులను సంప్రదించగా అది సుమారు రూ. 1.9కోట్లు విలువ చేస్తుందని చెప్పినట్లు నియామ్రిన్ తెలిపింది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. 


ఇక తిమింగలాల నుంచి స్రవించే ద్రవం ఈ విధంగా వాంతుల రూపంలో బయటపడుతుంది. ఇది చాలా ఖరీదైనది. సుగంధ ద్రవ్యాల తయారీలో వీటిని వాడతారు. ఇది బూడిద రంగులో మైనం ముద్దలా ఉంటుంది. మండే గుణం కూడా కలిగి ఉంటుంది. తిమింగలాలు తినే జీవుల వల్ల గొంతులోపలి భాగాలు దెబ్బతినకుండా స్రవించే ద్రవమే వాంతి రూపంలో బయటపడుతుంది. ఇది చాలా విలువైనది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు.

Updated Date - 2021-03-03T20:14:24+05:30 IST