శిథిలావస్థలో ఉప కాలువలు

ABN , First Publish Date - 2021-05-17T05:20:12+05:30 IST

తెలుగుగంగ ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

శిథిలావస్థలో ఉప కాలువలు
21వ బ్లాక్‌చానల్‌లో పేరుకుపోయిన పూడిక

  1. పేరుకుపోయిన పూడిక
  2. మరమ్మతులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి


రుద్రవరం, మే 16: తెలుగుగంగ ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 17 నుంచి 21 బ్లాక్‌చానళ్ల వరకు యూటీలు దెబ్బతిన్నాయి. కల్వర్టులు పగుళ్లు ఏర్పడ్డాయి. పూడిక పేరుకుపోయింది. కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. ఇలాగైతే సాగునీరు పారేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో అధికారులు నిమ్మకుండిపోతారు. ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమవుతున్నాయి. అయిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.  గంగ ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కాలువల గట్ల వెంట కంప చెట్లు ఏపుగా పెరిగి వెళ్లలేని పరిస్థితి. అధికారులు మాత్రం వర్షాలు కురిసేటప్పుడు హడావుడి చేస్తారు తప్ప పట్టించుకోవడం లేదు.  


కాలువలకు మరమ్మతులు చేపట్టాలి

తెలుగుగంగ ఉప కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. అధికారుల నిర్లక్ష్యానికి వదిలేశారు. చివరి ఆయకట్టుకు సాగు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. కాలువలు శిథిలావస్థకు చేరుకోవడంతో సాగునీరు సక్రమంగా ఆయకట్టుకు అందడం లేదు. 

- వెంకట్‌రెడ్డి, రైతు, డి.కొట్టాల

Updated Date - 2021-05-17T05:20:12+05:30 IST