చేతిపై అంకె ప్రత్యక్షం!
ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST
మీ స్నేహితుడిని పిలవండి. షుగర్ క్యూబ్‌పై రాసిన అంకెను చేతి పైకి వచ్చేలా మ్యాజిక్ చేస్తానని చెప్పండి. ఆ మ్యాజిక్ ఎలా చేయాలంటే...
మీ స్నేహితుడిని పిలవండి. షుగర్ క్యూబ్‌పై రాసిన అంకెను చేతి పైకి వచ్చేలా మ్యాజిక్ చేస్తానని చెప్పండి. ఆ మ్యాజిక్ ఎలా చేయాలంటే...
కావలసినవి:
- ఒక పెన్సిల్
- ఒక షుగర్ క్యూబ్(ఇంపీరియల్ షుగర్)
- ఒక గ్లాసు నీళ్లు.
ఇలా చేయాలి... ఫ ముందుగా మీ స్నేహితుడిని ఒక అంకె చెప్పమనండి. ఆ అంకెను షుగర్‌క్యూబ్‌పై పెన్సిల్‌తో రాయండి. ఫ తరువాత ఆ షుగర్ క్యూబ్‌ను గ్లాసులో వేసి కలపండి. షుగర్ క్యూబ్ నీళ్లలో పూర్తిగా కరిగిపోతుంది. ఫ ఇప్పుడు మీ స్నేహితుని చేతిని ఇలా ఇవ్వమని తీసుకొని, మీ అరచేతిని గ్లాసుపై మ్యాజిక్ చేస్తున్నట్టుగా తిప్పండి. ఫ తరువాత స్నేహితుడి చేతిని తిప్పి చూడమనండి. ఆశ్చర్యంగా ఆ అంకె మీ స్నేహితుని చేతిపై ఉంటుంది. ఫ ఈ మ్యాజిక్ చేసే సమయంలో మీరు ఒక ట్రిక్ ఫాలో కావాలి. అదేమిటంటే షుగర్ క్యూబ్‌పై పెన్సిల్‌తో అంకెను రాసిన తరువాత మీ చేతి బొటనవేలును ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల ఆ అంకె గుర్తు మీ బొటనవేలుపై పడుతుంది. తరువాత మీ ఫ్రెండ్ చేతిని గ్లాసుపై పెట్టి తిప్పే సమయంలో మీ బొటనవేలుతో అతని అరచేతిలో ప్రెస్ చేయండి. అంతే... ఇక్కడి అంకె గుర్తు అతని చేతిలో కనిపిస్తుంది.