Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ ఇంట్లో ఉన్న పసుపు మంచిదో, కల్తీదో రూపాయి ఖర్చు లేకుండా సులభంగా గుర్తించండిలా..!

ఆంధ్రజ్యోతి (14-09-2021): కల్తీ ఆహారపదార్థాలు చాలా ప్రమాదకరం. అయితే కల్తీ పదార్థాలను గుర్తించడం సులువే. పసుపులో కృత్రిమ రంగులు కలపడం ద్వారా కల్తీ చేస్తుంటారు. మరి ఆ కల్తీ పసుపుని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.


రెండు గాజు గ్లాసుల్లో నీటిని తీసుకోండి.


మీ దగ్గర ఉన్న రెండు రకాల పసుపును ఒక్కో గ్లాసులో ఒక టీస్పూన్‌ చొప్పున వేయండి.


కల్తీ జరగని పసుపు గ్లాసు అడుగుభాగంలో చేరిపోతుంది. నీళ్లు లేత పసుపు(లైట్‌ యెల్లో) రంగులోకి మారతాయి.


కల్తీ జరిగిన పసుపు వేసిన గ్లాసులో నీళ్లు ముదురు పసుపు (డార్క్‌ యెల్లో) రంగులోకి మారతాయి. పసుపు నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. 


ఇది ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వెల్లడించిన పద్ధతి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement