కనుల పండువగా తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-01-16T04:52:18+05:30 IST

కనుమ సందర్భం గా శుక్రవారం సాయంత్రం నగరంలోని దేవతామూర్తులు మైపాడు గేటు నుంచి మూడో మైలు వరకు భక్తులకు దర్శనమిచ్చారు.

కనుల పండువగా తెప్పోత్సవం
జాఫర్‌సాహెబ్‌ కాలువలో జరిగిన తెప్పోత్సవం

తెప్పపై ఊరేగిన భ్రమరాంబ సమేత మల్లేశ్వరుడు

సంప్రదాయబద్దంగా సంక్రాంతి, కనుమ

సమాధుల వద్ద పెద్దల పండుగ

భక్తి శ్రద్ధలతో గోపూజలు

నేడు ఏటి పండుగ


నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 15 : కనుమ సందర్భం గా శుక్రవారం సాయంత్రం నగరంలోని  దేవతామూర్తులు మైపాడు గేటు నుంచి మూడో మైలు వరకు భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా దేవతామూర్తు లను ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు  పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఈ ప్రాంతం తిరుణాళ్లను తలపించింది. భక్తిగీతాలు, వేద మంత్రాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. నవాబుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామికి జాఫర్‌సాహెబ్‌ కాలువలో తెప్పోత్సవం  కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా మైపాడు గేటు వద్ద కల్యాణ మండపంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఊరేగింపు, తెప్పోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు  పాల్గొన్నారు. 


భక్తిశ్రద్ధలతో గోపూజలు


 ఈ ఏడాది నగరంలో అన్ని ఆలయాల్లో గోపూజలు జరిగాయి. నెల్లూరు రూరల్‌  ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దంపతులు  గోమాతకు పూజలు చేశారు. అయ్యప్పగుడి, మూలస్ధానేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి ఆలయం, తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, నవాబుపేట మల్లేశ్వరస్వామి ఆలయం,  ఉస్మాన్‌సాహె బ్‌పే ట కోదండరామాలయాల్లో  గోపూజలు జరిగాయి. ఈ కార్యక్ర మాల్లో  ప్రధాన అర్చకులు, ధర్మకర్తలు, కార్యనిర్వహ ణాధికా రులు పాల్గొని గోపూజలు చేశారు. జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్‌ నరసింహులు వేదగిరి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో రూరల్‌ ఎమ్మెల్యేతో కలిసి గోపూజ, కనుమ, పారువేట  ఉత్సవాల్లో పాల్గొన్నారు. 


ఘనంగా కనుమ


 సంక్రాంతిలో మూడో రోజు కనుమను జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తమ జీవితాలకు ఎన్నో విధాలుగా సహకరించే పశుసంపదకు గౌరవం ఇచ్చేందుకు గోపూజ చేయడమే కనుమ పండుగ.  ఈ సందర్భంగా గోమాత పూజలు, కనుమ పార్వేట వేడుకలు వైభవంగా జరిగాయి. 


సంప్రదాయబద్దంగా సంక్రాంతి


 జిల్లా ప్రజలు గురువారం సంక్రాంతిని సంప్రదాయబ ద్ధంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటిని పచ్చతోరణాలు, అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. ప్రతి ఇంటా బంధువుల అనురాగాలు, ఆప్యాయతలు పలకరింపులతో సందడి నెలకొంది. సూర్యోదయానికి ముందే మహిళలు, యువతులు పోటీ పడి రంగవల్లులను తీర్చిదిద్దారు. తలంటి స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించారు. సంక్రాంతి పిండి వంటలను రుచిచూశారు. ఇంటింటా పొంగళ్లు పొంగించి పెద్దలకు  నూతన వస్త్రాలతో పూజలు చేశారు. పితృదేవతల్ని స్మరించుకున్నారు. సంక్రాంతి  సందర్భంగా అన్నీ ఆలయా లను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు తమతమ ఇష్ట దైవాలను దర్శించుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిఽధులు, ఎమ్మెల్యేలు అందరూ తమ సొంతూళ్లలో సంక్రాంతి వేడుకలు  జరుపుకున్నారు. డీఆర్‌డీవో చైౖర ్మన్‌ సతీష్‌రెడ్డి  తన స్వగ్రామం మహిమలూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి అంటేనే పెద్దల పండగ, నెల్లూరుతోపాటు పలు ప్రాంతాల్లో సంక్రాంతి సాయంత్రం వేళ సమాధుల వద్దకు చేరుకుని, వారి పెద్దల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ రంగవల్లుల పోటీలు, కబడ్డీ, క్రికెట్‌తోపాటు కోడి పందేలతో కాలం గడిపారు.


నేడు ఏటి పండుగ


  సంక్రాంతి  ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం పెన్నాలో ఏటి పండుగ జరగనున్నది. ఈ పండుగ సందర్భంగా మూడురోజులపాటు ముత్తైదువులు నోచిన గొబ్బెమ్మల్ని పెన్నానదిలో నిమజ్జనం చేస్తారు. గాలిపటాలు ఎగువేయడమేకాక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.  జొన్నవాడ కామాక్షితాయి, నర్రవాడ వెంగమాంబ, మూలస్ధానేశ్వరస్వామి, తల్పగిరి రంగనాఽథ స్వామి, రాజరాజేశ్వరి ఆమ్మవారి ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనం ఇస్తారు. ఇందుకోసం పెన్నా ఒడ్డున నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేసింది.

Updated Date - 2021-01-16T04:52:18+05:30 IST