నేటి నుంచే పది పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-23T05:42:30+05:30 IST

నేటి నుంచే పది పరీక్షలు

నేటి నుంచే పది పరీక్షలు
బషీరాబాద్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంఈవో సుధాకర్‌రెడ్డి

ధారూరు, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అధికా రులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ధారూరు మండలంలో ధారూరులోని బాలుర పాఠ శాల, కేరెల్లి జెడ్పీ స్కూళ్లలో టెన్త్‌ ఎగ్జాం సెంటర్లను ఏర్పాటు చేశామని, కేంద్రాల్లో అన్ని వసతులు కల్పి స్తున్నామని ఎంఈవో బాబుసింగ్‌ తెలిపారు. 23 నుంచి ప్రారంభమవుతున్న టెన్త్‌ పరీక్షలకు ధారూరు బాలుర, బాలికల, కుక్కింద, నాగసమందర్‌, నాగారం, మోమిన్‌కలాన్‌, కేరెల్లి, తరిగోపుల, ధారూరులోని కేజీబీవీ పాఠశాలల నుంచి మొత్తం 379 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ధారూరు బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలో 200మంది, కేరెల్లి పరీక్ష కేంద్రంలో 179మంది పరీక్షలు రాస్తారన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ధారూరులో ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారి, ఒక చీఫ్‌ సూపరిండెంట్‌, 12 మంది ఇన్విజిలేటర్లు, కేరెల్లిలో ఒక డిపార్టుమెంటల్‌ అధికారి, ఒక చీఫ్‌ సూపరిండెంట్‌, 10మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. హాల్‌ టికెట్లు రాని విద్యార్థులు అన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ స్కూల్‌ హెచ్‌ఎం సంతకం తీసుకొని పరీక్షకు హాజరుకావొచ్చని చెప్పారు. పరీక్ష సమయం కన్నా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9.35గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించేది లేదని ఆయన చెప్పారు. 


  • ఘట్కేసర్‌ మండలంలో 1,532 మంది విద్యార్థులు

ఘట్‌కేసర్‌ రూరల్‌: నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంఈవో శశిధర్‌ తెలిపారు.  మండలంలో 4 ప్రభుత్వ, 4 ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే శామని, 1,532 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులు సెంటర్లకు రావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30కల్లా చేరుకోవాలన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని సైతం అందుబాటులో ఉంచామన్నారు.


  • విద్యార్థులు ఇష్టంతో చదవాలి

పదో తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టం తో చదువాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని కొర్రెముల సర్పంచ్‌ ఓరుగంటి వెంకటే్‌షగౌడ్‌ అన్నారు. అవుశాపూర్‌, కొర్రెములలోని పదో తరగతి విద్యార్థుల కు హల్‌టికెట్లు అందజేశారు. పరీక్ష కాలంలో విద్యా ర్థులు సెల్‌ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండాలని తెలిపారు. పరీక్షలు బాగా రాసి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ దుర్గ, ఉపసర్పంచ్‌ కందుల రాజు, వార్డు సభ్యుడు అంజనేయులు, హెచ్‌ఎం వెంకటయ్య, నాగార్జున, సత్యనారాయణ, అంజయ్యయాదవ్‌, టీచర్లు పా ల్గొన్నారు. అవుశాపూర్‌లో సర్పంచ్‌ కావేరిమశ్చేందర్‌రె డ్డి, ఉపసర్పంచ్‌ ఐలయ్య, వార్డుసభ్యులు వీరేష్‌, శ్రీనివా్‌సగౌడ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


  • పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

కొడంగల్‌ రూరల్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాలన్ని ంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. కొడంగల్‌ మండలంలో 924మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాస్తారన్నారు. కొడంగల్‌లో నాలుగు కేంద్రాలు ఏర్పాటుచేశారు. బాలికల పాఠశాలలో రెండు, జూనియర్‌ కళాశాల, బాలుర పాఠశాల లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.


బషీరాబాద్‌ మండలంలో 586 మంది విద్యార్థులు

బషీరాబాద్‌:  పదో తరగతి పరీక్షలకు బషీరాబాద్‌ మండలంలో ఏర్పాట్లు చేశామని ఎంఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. బషీరాబాద్‌లోని బాలురు, బాలికాల పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 586 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-23T05:42:30+05:30 IST