సమావేశంలో మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్, పాల్గొన్న టీడీపీ నాయకులు
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్
గుంటూరు(తూర్పు), మే 26: జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ మహానాడు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జరిగే మహానాడు ప్రత్యేకమైనదన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త మహానాడులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి దార్శినికుడు పాలన ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమన్నారు. కార్యక్రమంలో దాసరి రాజమాష్టారు. నూతలపాటి రామారావు, కంచర్ల శివరామయ్య, గుంటుపల్లి మధుసూదనరావు, పి శివన్నారాయణ, కొత్తపల్లి కోటేశ్వరరావు, అబ్దుల్ గని, ఏసుబాబు, వెంకట సుబ్బారావు, ప్రసన్నకుమార్, రమేష్, చిన నరసింహారావు, ఇత్తడి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.