ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో ‘పది’ ఫలితాలు

ABN , First Publish Date - 2022-07-01T06:41:31+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 93.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్‌ సాధించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం 10 జీపీఏ సాధించారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వపాఠశాల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి.

ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో ‘పది’ ఫలితాలు
కోదాడలో ఎస్పీ పాఠశాలల విద్యార్థులను అభినందిస్తున్న కరస్పాండెంట్‌ సైదేశ్వరరావు

సూర్యాపేటఅర్బన్‌, జూన్‌ 30 : పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 93.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్‌ సాధించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం 10 జీపీఏ సాధించారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వపాఠశాల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. 

- సూర్యాపేట పట్టణంలోని జయ పాఠశాల విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించారు. 275 మంది పరీక్ష రాయగా 86 మంది 10 జీపీఏతో ప్రభంజనం సృష్టించారు. 65మంది విద్యార్థులు 9.8, 44 మంది 9.7, 25మంది 9.5 జీపీఏ సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌, డైరెక్టర్లు జ్యోతి, పద్మ విద్యార్థులను అభినందించారు. 

ఫసిటీ టాలెంట్‌ పాఠశాలలో 25మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 14 మంది 9.8 జీపీఎ, 24 మంది 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ ప్రకా్‌షరెడ్డి, మురళి అభినందించారు.

-విద్యాబారతి పాఠశాల విద్యార్థిని బి.సాత్విక 10 జీపీఏ సాధించారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ నంద్యాల నరేందర్‌రెడ్డి  అభినందించారు.

-సృజన పాఠశాల విద్యార్థులు పది పరీక్ష ఫలితాల్లో సత్తాచాటారు. 53 మంది విద్యార్థులకు ఎనిమిది మంది 10 జీపీఏ సాధించారు. 44 మంది విద్యార్థులు 9.0 జీపీఏ సాధించారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనివా్‌సరావు, రవికుమార్‌ అభినందించారు.

-కేఎ్‌సరెడ్డి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి అక్షిత్‌ 10 జీపీఏ సాధించినట్లు కరస్పాండెంట్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. 

ఫజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల-2 విద్యార్థిని గోపనబోయిన జ్ఞాహ్నవి 10 జీపీఏ సాధించింది. విదార్థిని ప్రిన్సిపాల్‌ అంకతి వెంకన్న అభినందించారు. 

- నేరేడుచర్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. నేరేడుచర్ల ఉన్నత పాఠశాలకు విద్యార్థి యారగొర్ల అఖిల్‌ 10, ముత్తినేని జ్ఞానేశ్వరి 9.8 జీపీఏ సాధించారు. అదేవిధంగా శ్రీవాణి స్కూల్‌లో ముగ్గురు, కృష్ణవేణి, ప్రగతి స్కూల్‌లో ఇద్దరు, పినాకిల్‌ స్కూల్‌లో ఒకరు చొప్పున 10జీపీఏ సాధించారు.  

- తిరుమలగిరికి చెందిన అక్షర  పాఠశాల చెందిన  కుక్కల ఉపేందర్‌, మాంటీస్సోరీ పాఠశాలకు చెందిన గిలకత్తుల శ్రుతి, సల్ల శ్రీహర్ష 10 జీపీఏ సాధించారు. మోడల్‌స్కూల్‌ విద్యార్థిని జాస్మిని, 9.8, జలాల్‌పురం, వెలిశాల విద్యార్థినులు అనూష 9.7, హరిణి 9.7, వశిష్ట ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని చందన 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థులను ప్రధానోపాద్యాయులు శ్రావణ్‌ కుమార్‌, అశోక్‌  అభినందించారు.

-గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు జి.జీవన్‌, ఎన్‌.మనోజ్‌ 10 జీపీఏ సాధించారని ప్రిన్సిపాల్‌ దండెం రవికుమార్‌ తెలిపారు. 

- చిలుకూరులోని బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు భాగ్యశ్రీ, మేఘన, సాహితీలు 10 జీపీఏ సాధించారు. ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలతో పాటు ఆచార్యులగూడెం, జెర్రిపోతులగూడెం, నారాయణపురం, గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. నారాయణపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని నవ్య 9.7జీపీఏ సాధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మండల టాపర్‌గా నిలిచింది. 

- కోదాడ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు పది ఫలితాలలో 88.74ఉతీర్ణత సాధించారు. పట్టణంలోని ఎస్వీ, తేజ, అక్షయఫౌండేషన్‌, బాలికల, బాలుర, అంబేడ్కర్‌కాలనీ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య, నారాయణ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించి సత్తా చాటారు. ఎస్వీ పాఠశాల విద్యార్థులు కె మురళీ, ఎం.క్రాంతిశ్రీలను కరస్పాడెంట్‌ ముత్తినేని సైదేశ్వరరావు అభినందించారు. తమ విద్యార్థులు రాణించటంపై తేజ ప్రిన్సిపాల్‌ జానకిరామయ్య, అక్షయ ఫౌండేషన్‌ ప్రిన్సిపాల్‌ నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎంఈవో సలీం షరీఫ్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.  

- హుజూర్‌నగర్‌  పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల ఇద్దరు విద్యార్థులు చందోలు వెంకటసాయివంశీ, తొడేటి వినయ్‌ 10జీపీఏ సాధించారు. విద్యార్థులను హెచ్‌ఎం తుమ్మా మర్రెడ్డి అభినందించారు. శ్రీచైతన్య విద్యార్థులు  పాలకూరి వర్షశ్రీ, ఏలూరు వినయ్‌కుమార్‌రెడ్డి 10 జీపీఏ సాధించారని ప్రిన్సిపాల్‌ రమణ తెలిపారు. 

- మేళ్లచెర్వు మండలంలో పదో తరగతి ఫలితాల్లో 93.43శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎంఈవో సైదానాయక్‌ తెలిపారు. 381మంది విద్యార్థులకు 356 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 

- కోదాడ మండలం కొమరబండ తేజ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ రమాదేవి తెలిపారు. ముగ్గురు 10 జీపీఏ సాధించగా, 10 మంది 9.8 జీపీఏ సాధించారని, 44మంది 9కి పైగా జీపీఏ సాధించారని తెలిపారు.  

-నూతన్‌కల్‌ మండలకేంద్రంలోని నాగార్జున ఉన్నతపాఠశాల విద్యార్థులు ఆకుల వైష్ణవి, చామకూరి దీక్షిత 10 జీపీఏ సాధించగా, గుర్రం విఘ్నేష్‌, ఆకుల మధుశ్రీ, చిట్టిపోలు అరుణ్‌, కొలిచెల్మ సాయి సిద్ధార్థ 9.8 పాయింట్లు సాధించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్ష్మి సుకృత 9.7 సాధించారు. హెచ్‌ఎంలు దామెర శ్రీనివాస్‌, మారగాని వెంకన్నగౌడ్‌, మల్లు ఉపేందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ తదితరులు విద్యార్థులను అభినందించారు. 

-సూర్యాపేట మండలం ఇమాంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల్లో యశ్వంత్‌, టి.సత్య, ఎన్‌.మానస, ఎం. అభిలాష్‌, కె,శృతి 10జీపిఏ సాధించారు. 10మంది 9.8 సాధించగా, 9.7జీపీఏను 10మంది సాధించారు.9 జీపీఏ సాధించిన విద్యార్థులు 58మందికి పైగా  ఉన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ శంకర్‌నాయక్‌ అభినందించారు.    

- మునగాల మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 84శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో సలీంపాష తెలిపారు. ఇద్దరికి 10 జీపీఏ వచ్చిందన్నారు.  నూప్రజ్ఞ హైస్కూల్‌, మునగాల పబ్లిక్‌ స్కూల్‌, ట్రీనిటీ, విద్యార్థులు మండల టాపర్లగా నిలిచారని పాఠశాలల కరస్పాండెట్లు కె.కృష్ణమూర్తి, ఎం.జాకబ్‌రాజు, నాగరాజు తెలిపారు.


Updated Date - 2022-07-01T06:41:31+05:30 IST