రేపటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

ABN , First Publish Date - 2020-06-07T10:09:16+05:30 IST

కరోనా వైరస్‌ తరుణంలో సుమారు 80 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఆలయాలు సోమవారం పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి.ఇందుకుగాను

రేపటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

కరీంనగర్‌ కల్చరల్‌, జూన్‌ 6: కరోనా వైరస్‌ తరుణంలో సుమారు 80 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఆలయాలు సోమవారం పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి.ఇందుకుగాను దేవాదాయశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏ విభాగ ఆలయాలు 12, బి విభాగ ఆలయాలు 37, సీ విభాగ ఆలయాలు 10 ఉన్నాయి. అలాగే రిజిస్ర్టేషన్‌ అయిన దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలు 1489 ఉన్నాయి. ఇవన్నీ ఆలయాల్లో సోమవారం నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.


కరోనా వైరస్‌ సంబంధిత ప్రత్యేక జోన్లలో ఉన్న ఆలయాల్లో దర్శనాలు ఉండవు. ఎవరికివారు చైతన్యంతో, అవగాహనతో సిబ్బంది, భక్తుల మధ్య సమన్వయంతో ప్రవర్తిస్తే అంతా మేలు జరుగుతుందని, దీనికి అందరు సహకరించాలని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ విజయరామారావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో శానిటైజేషన్‌ జాగ్రత్తలు, భౌతిక దూరాన్ని పాటించేలా సర్కిల్స్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T10:09:16+05:30 IST