భక్తిశ్రద్ధలతో శ్రావణ సోమవారం పూజలు

ABN , First Publish Date - 2022-08-09T05:50:05+05:30 IST

దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల జిల్లాలతోపాటు, హైదరాబాద్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించకుని మొక్కులు తీర్చుకున్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణ సోమవారం పూజలు
కొప్పోల్‌లో సంగమేశ్వరుడికి పూజలు చేస్తున్న భక్తులు

ఝరాసంగం/గుమ్మడిదల/పెద్దశంకరంపేట/నారాయణఖేడ్‌/చిన్నశంకరంపేట/హవేళిఘణపూర్‌, ఆగస్టు 8: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల జిల్లాలతోపాటు, హైదరాబాద్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించకుని మొక్కులు తీర్చుకున్నారు. సామూహిక అభిషేకాలు, నవగ్రహ పూజలు నిర్వహించారు. అలాగే, ఝరాసంగం మండల పరిధిలోని మల్లయ్యగిరిగుట్టపై భక్తుల సందడి  నెలకొంది.


బొంతపల్లి వీరన్న ఆలయంలో..

గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రతాలు చేశారు. అలాగే, బొంతపలి,్ల కానుకుంట గ్రామాల్లో బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.


కొప్పోల్‌ సంగమేశ్వర ఆలయంలో..

పెద్దశంకరంపేట మండల పరిధిలోని కొప్పోల్‌ ఉమాసంగమేశ్వర ఆలయంలో సోమవారం శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు సంగప్ప ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పెద్దశంకరంపేటకు చెందిన గడ్డం వెంకటేశం భక్తులకు అన్నదానం చేశారు. నారాయణఖేడ్‌ పట్టణంలోని సంగమేశ్వర, కాశీనాథ్‌; సత్యనారాయణస్వామి, నగిరేశ్వర ఆలయాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. హవేళిఘణపూర్‌ మండలంలోని ముత్తాయికోటలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేటలోని సోమేశ్వరాలయంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2022-08-09T05:50:05+05:30 IST