సీఎం సహకారంతో ఆలయాభివృద్ధి

ABN , First Publish Date - 2022-02-15T05:01:12+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతోనే కోనాయిపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి హరీశ్‌రావు యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఆలయాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.

సీఎం సహకారంతో ఆలయాభివృద్ధి
కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో హరీశ్‌రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్నదృశ్యం

రూ3.50 కోట్లతో కోనాయిపల్లిలో పునఃప్రతిష్ఠ : మంత్రి హరీశ్‌రావు


నంగునూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతోనే కోనాయిపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి హరీశ్‌రావు యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఆలయాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామంతో పాటు ఆలయ అభివృద్ధికి రూ.3.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామస్థుల విజ్ఞప్తుల మేరకు దేవాదాయశాఖ నుంచి ప్రత్యేక నిధులను మంజూరు చేశామన్నారు. ఆలయ పునరుద్ధరణతో పాటు కల్యాణ మండపం, రాజమండపలం, రాజగోపురం నిర్మాణం చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇష్ట దైవం, సెంటిమెంట్‌ ఆలయంగా పిలవబడే కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని హరీశ్‌రావు పట్టువస్త్రాలను ధరించి సోమవారం ఉదయం ఆలయానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజాశర్మ, జడ్పీటీసీ ఉమావెంకటరెడ్డి, సర్పంచ్‌ వెంకటేశం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య, మాజీ జడ్పీటీసీ దువ్వల మల్లయ్య, సహకార సంఘం చైర్మన్‌లు రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-15T05:01:12+05:30 IST