సామీ.. ఏమిటీ దుస్థితి?

ABN , First Publish Date - 2021-08-28T04:59:50+05:30 IST

వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి కరోనాకు ముందు శని, ఆది వారాల్లో 20వేల మందికి పైగా భక్తులు వచ్చేవారు. ఇటువంటి ఆలయానికి నేడు భక్తులు రావాలంటే భయపడు తున్నారు.

సామీ.. ఏమిటీ దుస్థితి?
వైకుంఠపురం ఆలయం

 వైకుంఠపురం ఆలయంలో నిలువు దోపిడీ

రూ.20 టెంకాయ రూ.50కి పైగా విక్రయం

మందు బాబులకు అడ్డాగా ఆలయ ప్రాంగణం

సీనియర్‌ అర్చకుల పోకడతో భక్తుల బెంబేలు

రెండేళ్లుగా తండ్రికి బదులు విధుల్లో కుమారుడు


 జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో తెనాలి వైకుంఠపురం ఆల యం ఒకటి. శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి  దర్శనం కోసం వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. స్వామివారి కృప కోసం వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లోని పోకడలతో మనోభావాలు దెబ్బతింటున్నాయి. స్వామి వారి సేవలో తరించాల్సిన అర్చకులు ఆర్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. చేయి తడిపితే చాలు.. ఇక్కడ ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా ఉంది. సామాన్య భక్తులకు అంతంత మాత్రం సేవలు అం దుతుండగా.. పలుకుబడి, దక్షణ ఎక్కువగా ఇచ్చే వారికి పూజలు చేసేందుకు అర్చకులు పోటీలు పడు తుంటారంటే ఆశ్చర్యం కాదు. 


తెనాలిటౌన్‌, ఆగస్టు 27: వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి కరోనాకు ముందు శని, ఆది వారాల్లో 20వేల మందికి పైగా భక్తులు వచ్చేవారు. ఇటువంటి ఆలయానికి నేడు భక్తులు రావాలంటే భయపడు తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొరవడిన పర్యవేక్షణతో ఆలయ ప్రాంగణం దోపిడీకి నిల యంగా మారింది. ఒక వైపు వ్యాపారులు, మరో వైపు అర్చకులు, ఇంకో వైపు మందు బాబుల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. పవిత్రమైన యాగాలకు ఉపయోగించే యాగశాలలో యజ్ఞాలను నిలిపివేసి దానిని కేశఖండనశాలగా మార్చేశారు. ఇది శాస్త్ర విర్ధుమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఆలకించే వారు లేరు. భక్తులు ఆలయం లోపలకు అడుగు పెట్టడంతోనే దోపిడీకి తెరలేపుతున్నారు. మార్కెట్లో రూ.20 ఉండే టెంకాయను ఇక్కడ రూ.50 నుంచి 60 వరకు అమ్ముతున్నారు. అదేమంటే కాం ట్రాక్ట్‌ రేట్లు పెరిగిపోయా యంటున్నారు. సైకిల్‌ స్టాండ్‌లో రూ.10 చెల్లించాలి.ఆలయంలోకి వెళ్లకుండానే ఒక్కో భక్తుడు వివి ధ రూపాల్లో రూ. 100కు పైగా జేబు కు చిల్లు పడు తుంది. ఆలయంలో భక్తులు ఎ క్కువగా తిరిగే ప్రాంతాల్లోనూ మందుబాబుల ఆగడాలు ఆగడం లేదు. కల్యాణ వేదికల వద్దే మం దుబాబులు తాగి సీసాలు పడేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా పట్టించుకునే నాధుడే లేడు. అర్చ కుల్లో సైతం మం దు బాబులున్నారంటే ఆశ్చర్యం కాదు.


బరువును బట్టే సేవలు 

ఇక ఆలయంలోని అర్చకులకు బరువు ఎంత బాగా ముట్టచెపితే అంత బాగా సేవలు చేస్తారు. తెలిసిన వారు, ఎక్కువ మొత్తాన్ని దక్షణగా ఇచ్చేవారు వచ్చారంటే చేసే పూజలను కూడా  వదలి వెళ్లి పోయే అర్చకులు ఈ ఆలయంలో ఉన్నారు. జూనియర్లపైనే భారమంతా వేసి కొంతమంది సీనియర్‌  అర్చకులు కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. హుండీలో వేసే కానుకలను సైతం అడ్డుకుంటూ లాగేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇటీవల హుండీలో భక్తుడు కానుక వేస్తున్న సందర్భంలో దానిని ఓ సీనియర్‌ అర్చకుడు  అడ్డుకున్నాడు. దీనిని మరో భక్తుడు వీడియో తీసి ఈవోకు పంపగా ఆ అర్చకుడ్ని పది రోజులకు పైగా ప్రధాన ఆలయంలో విధులకు దూరం గా పెట్టారు. ఇంకో అర్చకుడి కుమా రుడు డబ్బులిచ్చే భక్తు లు కనిపించగానే లే వలేక పోయినా పరుగులు తీస్తారు. సామాన్యులకు మాత్రం పూజలు చేయరు. వీరిపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.  




రెండేళ్లుగా తండ్రి విధుల్లో కొడుకు

ప్రసాదం తయారీ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లుగా రావడం లేదు. అయితే ఆయన కొడుకు వరాహ స్వామి ఆలయంలో అర్చకత్వం చేస్తుంటాడు. అయితే ఇతనే తండ్రి విధులు నిర్వహిస్తూ పాపం అటూ ఇటూ పరుగెడుతుంటాడు. ప్రసాదం తయారీ కేంద్రం పర్యవేక్షణలోనూ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయినా అధికారులు ఇవేవీ పట్టించుకోరు. ఇటీవల చార్జి తీసుకున్న ఈవో ఆలయ దుస్థితిని మారుస్తారని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2021-08-28T04:59:50+05:30 IST