Abn logo
Aug 8 2020 @ 03:01AM

కశ్మీర్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

శ్రీనగర్‌, ఆగస్టు 7: వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి జమ్మూ కశ్మీర్‌లో 6.9 డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ప్రపంచ, జాతీయ ఉష్ణోగ్రతలలో అంచనా వేసిన సగటు కంటే ఎక్కువ. అంతేకాదు ఈ ప్రాంతంలోని హిమానీ నదాలు 85 శాతం వరకూ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.


Advertisement
Advertisement
Advertisement