‘సంస్థాగత’ సందడి

ABN , First Publish Date - 2020-09-25T17:34:10+05:30 IST

తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికలతో నూతనోత్తేజం కనిపిస్తోంది..

‘సంస్థాగత’ సందడి

సంస్థాగత ఎన్నికలతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం

27న పార్లమెంటరీల వారీగా కమిటీల ప్రకటన

కాకినాడ పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్‌

అమలాపురంనకు రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా ఆయన సతీమణి

రాజమహేంద్రవరంనకు గన్ని, కేఎస్‌ జవహర్‌ పేర్లు పరిశీలన


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికలతో నూతనోత్తేజం కనిపిస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావం, అధికార వైసీపీ బెదిరింపులతో టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తూ వచ్చాయి. దీంతో కొంతకాలం గా ఆయా శ్రేణులు నిరాశాజనకమైన వాతావరణంలో నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ప్రస్తుతం సంస్థాగత ఎన్ని కల నేపథ్యంలో మళ్లీ కొంత ఉత్సాహం నెలకొంది. జిల్లాలో ఒకరిద్దరు నేతలు  పార్టీ ఫిరాయించినా కార్యకర్తల బలం చెక్కుచెదరలేదు. ప్రభుత్వం ఇటీవల వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్ని వర్గాల నుంచి టీడీపీకి మద్దతు పెరుగుతోంది. గతేడాది గ్రామ, మండల, పట్ట ణ కమిటీల నియామకం సుమారుగా పూర్తయింది. ఒకటి రెండు ప్రాంతాల్లోనే చిన్న సమస్య ఉంది.


ఇక ప్రస్తుత పార్లమెంటరీ కమిటీల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇప్పటివరకూ జిల్లా స్థాయిలో ఒకటే కమిటీ ఉండేది.  త్వరలో పార్లమెంటరీ వారీ జిల్లాలు ఏర్పాటు కానుండడంతో ఇప్పటికే మిగతా రాజకీయ పార్టీలు పార్లమెంటరీ కమిటీలను నియమించాయి. తెలుగుదేశం కూడా ఈ దిశగా కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 27న  ఈ కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులతోపాటు, పూర్తి కమిటీని, అనుబంధ కమిటీల నియామకం కూడా జరిగే అవ కాశం ఉంది. ఈ కమిటీల్లో యువతకు, మహిళలకు, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల సమస్యలపై బలంగా గళం ఎత్తడానికి, ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి టీడీపీ సమాయత్తమవుతోంది.


కాకినాడకు జ్యోతుల నవీన్‌

కాకినాడ పార్లమెంటరీ కమిటీ టీడీపీ అధ్యక్షుడిగా జడ్పీ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ పేరును పరిశీలిస్తున్నారు. తుది పరిశీలనలో ఆయన పేరు మాత్రమే ఉన్నట్టు సమాచారం. నవీన్‌ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ జ్యోతుల నెహ్రూ తనయుడు. మెట్ట ప్రాంతంలో పట్టున్న కుటుంబం.  కాబట్టి ఆయనకు పదవి ఇవ్వడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఆయన కాపు వర్గానికి చెందిన నేత కావడం కూడా ఒక కారణం.


ఇక జిల్లాలో మూ డు పార్లమెంటరీ జిల్లాలకు మూడు వర్గాల నుంచి అధ్యక్ష పదవులు ఇవ్వనున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని బీసీలు కూడా అధికంగా ఉంటారు. ఎస్‌సీలు కూడా ఉన్నారు. ఇతర ఓసీ వర్గాలు కూడా ఉన్నాయి. కానీ జిల్లాలో మిగతా పార్లమెంటరీ జిల్లాలకు మరో రెండు వర్గాలకు ప్రాధాన్యం లభించనుండడంతో కాకినాడ పార్లమెం టు పార్టీ అధ్యక్ష పదవి నవీన్‌కు దక్కే అవకాశం ఉంది. ప్రధాన కార్యదర్శి పదవి బీసీలకు దక్కే అవకాశం ఉంది. ఇతర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


రాజమహేంద్రవరంనకు గన్ని, జవహర్‌ పేర్లు పరిశీలన

రాజమహేంద్రవరం పార్లమెంటులో తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియో జకవర్గాలు ఉన్నాయి. ఈ కమిటీ అధ్యక్షుడిగా గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత గన్ని కృష్ణ పేరు, మాజీ మంత్రి, కొవ్వూరుకు చెందిన కేఎస్‌ జవహర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీ వర్గానికి ఇవ్వలసి వస్తే కేఎస్‌ జవహర్‌కు ఈ పదవి లభించనుంది. ఉభయగోదావరి జిల్లాల్లో వర్గాల సమీకరణ బేరీజు మీద ఈ కమిటీ అధ్యక్ష పదవి ఆధారపడి ఉంది. మిగతా వర్గాల నుంచి ప్రధాన కార్యదర్శి, ఇతర కమిటీ సభ్యుల నియామకం ఉంటుంది.


కోనసీమకు రెడ్డి సుబ్రహ్మణ్యం?

అమలాపురం పార్లమెంటరీ అధ్యక్ష పదవి బీసీలకు దక్కే అవకాశం ఎక్కు వగా ఉంది. ఇక్కడ బీసీ వర్గాల్లో ఎక్కువగా ఉన్న శెట్టిబలిజ వర్గానికి ప్రాధాన్యం లభించనుంది. ఈ నేపఽథ్యంలో శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా ఆయన సతీమణికి ఈ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రధాన కార్యదర్శి పదవి, ఎస్సీ, బీసీ, ఓసీలలో ఒకరికి లభించవచ్చు. ఇప్పటిదాకా జిల్లా అధ్యక్ష పదవిని కోనసీమకు చెందిన నామన రాంబాబు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


Updated Date - 2020-09-25T17:34:10+05:30 IST