తెలుగు జాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:12:57+05:30 IST

తెలుగు జాతి కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు.

తెలుగు జాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్‌
బద్వేలులో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

పులివెందుల టౌన్‌, జనవరి 18: తెలుగు జాతి కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు  దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. మంగళవారం పులివెందులలో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ హెచ్‌ఆర్‌డీ సభ్యుడు రామ గోపాల్‌రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అమర్‌నాథరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, పార్లమెంట్‌ కార్యదర్శి మైసూరారెడ్డి, తెలుగు యువత నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణగిరి రమేష్‌, ఎరికలరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, రామాంజనేయులురెడ్డి పాల్గొన్నారు. 

బద్వేలులో   ఘనంగా ఎన్టీఆర్‌  వర్థంతి 

బద్వేలు, జనవరి 18 : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్థంతిని మంగళవారం టీడీపీ శ్రేణులు ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని నెల్లూరురోడ్డులో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేదలు, కార్య కర్తలు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ   బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌ ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బిజివేముల మహేందర్‌రెడ్డి, ఉపాఽధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి, నరసింహనాయుడు, మహబూబ్‌బాష, జహంగీర్‌ బాష, రామసుబ్బారెడ్డి, నాగభూషణం, మిత్తికాయల రమ ణ, ఎల్లారెడ్డి, మునిరెడ్డి, దానం పాల్గొన్నారు.

వేంపల్లెలో: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ పేర్కొన్నారు. వేంపల్లెలో ఎన్టీఆర్‌ వర్దంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటటానికి టీడీపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్లు బాలస్వామిరెడ్డి, మునిరెడ్డి, కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు జగన్నాథరెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్‌ ఎద్దల కొండ్రాయుడు, కుమ్మరాంపల్లె భాస్కర్‌రెడ్డి, పాపిరెడ్డి, గోటూరు నాగభూషణం, పివి రమణ, రజనీకాంత్‌రెడ్డి, మహబూబ్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోపవరంలో : స్వర్గీయ నందమూరి తారకరామారావు యుగపురుషుడని మండల టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా మండలంలోని శ్రీనివాసపురం కూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ  జయరామిరెడ్డి,  టీడీపీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి,  సర్పంచ్‌ శ్రీనివాసులు, రామానాయుడు, శివారెడ్డి, బాలచెన్నయ్య, రామసుబ్బారెడ్డి,  కార్యకర్తలు పాల్గొన్నారు. 

పోరుమామిళ్ల : బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భైరవప్రసాద్‌, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ సాధనకారి రాము అన్నారు. మంగళవారం పోరుమామిళ్లలో రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో , ఓఎల్‌ఎఫ్‌ ఆస్పత్రిలో రోగులకు బ్రడ్లు, పండ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనుమలపూటి రామసుబ్బారావు, సీతావెంకటసుబ్బయ్య, గాలి మురళీమోహన్‌, షరీఫ్‌, మస్తాన్‌, గాజులపల్లి రవికుమార్‌,  సీతా సురేష్‌, ప్రొఫెసర్‌బాషా, సత్యరాజ్‌, బండి ఓబులేసు, తోటా బ్రహ్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 

వేములలో: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పులివెందుల మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పార్థసారధిరెడ్డి అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసిన  నివాళులర్పించారు.  కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు ఓబ య్య, గ్రామ కమిటీ అద్యక్షుడు రాములు, ఓబుళరెడ్డియాదవ్‌, రమణారెడ్డి, మైసూరారెడ్డి, చంటి, నాగభూషణరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపేటలో: యుగపురుషుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్బంగా స్థానిక లారెన్స్‌ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కేసీకెనాల్‌ ప్రాజెక్టు వైస్‌ఛైర్మన్‌ రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి అన్నదానం నిర్వహించారు. అనంతరం దుంపలగట్టులోని ఎన్టీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు  గౌస్‌,  రవి,  నాగేశ్వరరెడ్డి,  భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి  పాల్గొన్నారు. 

ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

మైదుకూరు, జనవరి 18 : ప్రజా శ్రేయస్సే ద్యేయంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలే సాధనంగా ప్రతి ఒక్కరూ పార్టీ అభివృ ద్ధికి కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో నాయకులు  మహేంద్ర, శివరాం,  క్రిష్ణయ్య.  మండల  ఇన్‌చార్జ్‌లు బాబు,  భీమయ్య, లక్ష్మిరెడ్డి, సుధాకర్‌రెడ్డి,  రమణారెడ్డి, సుబ్బారెడ్డి, డి. జగన్‌,  శ్రీనివాసులు పాల్గొన్నారు. 

చాపాడులో:  స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు 26వ వర్ధంతి సందర్భంగా మాజీ టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌  పల్లవోలు వద్ద ఉన్న కాశిరెడ్డినాయన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మంగళవారం దుప్పట్లు, మంచాలు, పండ్లు, వాషింగ్‌మిషన్‌ పంపిణీ చేశారు. వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటాయని మండల టీడీపీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి,  సుదర్శన్‌, రవిశంకర్‌రెడి ్డ, వైవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్‌రెడి ్డ, నాయబ్‌రసూల్‌, సలీం, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 





Updated Date - 2022-01-19T05:12:57+05:30 IST