తెలుగుగంగ విడుదల

ABN , First Publish Date - 2021-05-18T06:50:26+05:30 IST

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు నీటి కోసం సోమవారం కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఈ రెండు జిల్లాల్లో తాగు, సాగు నీటి ఎద్దడి నెలకొని ఉండడంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి కరోనా నిబంధనలు పాటిస్తూ పవర్‌ స్లూయిస్‌లోని స్విచ్‌ ఆన్‌చేసి సత్యసాయి గంగకాలువకు నీటిని విడుదల చేశారు.

తెలుగుగంగ విడుదల

రాపూరు, మే 17: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు నీటి కోసం సోమవారం కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఈ రెండు జిల్లాల్లో తాగు, సాగు నీటి ఎద్దడి నెలకొని ఉండడంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి కరోనా నిబంధనలు పాటిస్తూ పవర్‌ స్లూయిస్‌లోని స్విచ్‌ ఆన్‌చేసి సత్యసాయి గంగకాలువకు నీటిని విడుదల చేశారు.  తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని,  అంచలంచెలుగా పెంచుతూ 2500 క్యూసెక్కుల వరకూ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు జిల్లాల్లో సుమారు 2.5లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న రెండో పంటకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 120 రోజులపాటు జలాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కండలేరు జలాశయ పరిధిలోని అన్ని చెరువులకు నీటిని అందించనున్నట్లు ప్రకటించారు. స్వర్ణముఖి నదికి తెలుగుగంగను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల ప్రజలు తాగునీటి కోసం ఈ నీటిని వినియోగించుకోవచ్చునన్నారు. 


Updated Date - 2021-05-18T06:50:26+05:30 IST