TDP supports Jagdeep Dhankhar: టీడీపీ మరో కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-04T02:42:20+05:30 IST

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే (National Democratic Alliance) అభ్యర్ధి జగ్‌దీప్ ధన్‌కర్‌ (Jagdeep Dhankhar)కు మద్దతివ్వాలని నిర్ణయించింది.

TDP supports Jagdeep Dhankhar: టీడీపీ మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే (National Democratic Alliance) అభ్యర్ధి జగ్‌దీప్ ధన్‌కర్‌ (Jagdeep Dhankhar)కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఢిల్లీలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు... జగ్‌దీప్ ధనకర్‌‌ను కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగ్‌దీప్ ధనకర్‌‌‌కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జగ్‌దీప్ ధనకర్‌‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు పరిపాలనా దక్షత కలిగిన నేత అని ధనకర్‌‌‌‌ కొనియాడారు.





టీడీపీ ఎంపీలు జగ్‌దీప్ ధనకర్‌‌‌‌ను కలిసిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రహ్లాద్ జోషి నివాసంలోనే ఉన్నారు. టీడీపీ ఎంపీలతో షా ముచ్చటించారు. తాము ధన్‌కర్‌కు పూర్తి మద్దతిస్తున్నామని షా కు కూడా ఎంపీలు తెలిపారు. ఈ సందర్భంగా షా వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా టీడీపీ ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చింది.   


మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) అధినేత్రి మాయావతి (Mayawati), బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఇప్పటికే ధన్‌కర్‌కు మద్దతు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధనకర్‌‌ను ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో తృణమూల్ కాంగ్రెస్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరాదని నిర్ణయించింది.


ఈ నెల ఆరున ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ( Vice President Venkaiah Naidu) పదవీకాలం ఈ నెల 10న పూర్తి కానుంది. 

Updated Date - 2022-08-04T02:42:20+05:30 IST