Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రం నుంచి ఉచితంగా టెలీ కన్సల్టేషన్‌

వాట్సాప్ తో  ఉచితంగా టెలీ కన్సల్టేషన్స్‌కు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్ర ‘ఎలకా్ట్రనిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌’ మంత్రిత్వశాఖ ‘కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎ్‌ససీ)’ స్కీమ్‌ను ఆరంభించింది. దీని కింద వాట్సా్‌పతో ప్రత్యేకించి హెల్ప్‌లైన్‌ ‘సీఎ్‌ససీ హెల్ప్‌ సర్వీసెస్‌ డెస్క్‌’ను ఏర్పాటు చేసింది. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు దీంతో సేవలను అందించనుంది. పరిపాలన మొదలుకుని వైద్య సేవలు, కొవిడ్‌కు సంబంధించి విశ్వసనీయ వనరులు అంతకుమించి సందేహ నివృత్తికి అవకాశం కల్పిస్తోంది. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 917290055552 నెంబర్‌కు హాయ్‌ అని పంపి డాక్టర్‌తో కనెక్ట్‌ కావచ్చు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం కాగా తద్వారా సామాజిక, ఆర్థికంగా ఇంక్లూజివ్‌ గ్రోత్‌కు వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. చాట్‌బోట్‌ను సైతం యూనిక్‌గా రూపొందించింది. కస్టమరైజ్డ్‌ సొల్యూషన్‌గా ఈ సేవలను భారత దేశ ప్రజలకు అందించాలని భావిస్తోంది. 

Advertisement
Advertisement