ప్రైవేట్‌ జోరు.. సర్కారు ఉసూరు

ABN , First Publish Date - 2021-03-02T06:47:52+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మలిదశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రైవేట్‌ జోరు.. సర్కారు ఉసూరు
జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారు

వ్యాక్సిన్‌ ఏర్పాట్లలో లోపాలు

సర్వర్‌ సమస్యతో ఆలస్యంగా మొదలు

చాలా చోట్ల మధ్యాహ్నం నుంచి వ్యాక్సినేషన్‌

గ్రేటర్‌లో 2,846 మందికి టీకాలు

ప్రభుత్వ ఆస్పత్రులు  14

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు 19

 

హైదరాబాద్‌ జిల్లా 

ప్రభుత్వ ప్రైవేటు         మొత్తం

482       1,720   2,202

రంగారెడ్డి

ప్రభుత్వ ప్రైవేటు మొత్తం

 225         207 432

మేడ్చల్‌

ప్రభుత్వ ప్రైవేటు మొత్తం

79         133   211

మొత్తం టీకాలు వేయించుకున్న వారు  2,845


హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో మలిదశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రేటర్‌ పరిధిలో 14 ప్రభుత్వ ఆస్పత్రులు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలతో పాటు 19 ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులలో టీకాలు వేశారు. చాలా చోట్ల సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో సకాలంలో టీకాలు వేయలేకపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాత మొదలైంది. కొన్నిచోట్ల మూడు గంటలు ఆలస్యం కాగా, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం రెండు, మూడు గంటలకు టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు వెనుతిరిగి పోయారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే అత్యధికంగా టీకాలు వేసుకున్నారు. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఒక్కోచోట 200 మంది వరకు టీకాలు వేయించుకున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 నుంచి 40 మంది లోపు మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకున్నారు. మొదటి రోజు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశారు.  

 సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి టీకా వేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ టీకా వేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని సంతృప్తి వ్యక్తం చేశారు.  

 అపోలో ఆస్పత్రి, అపోలో మెడికల్‌ కాలేజీలో  400 మంది పేర్లను నమోదు చేసుకోగా, 200 మంది వరకు టీకాలు వేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారున్నారు. 45 ఏళ్లకు పైబడి వివిధ జబ్బులతో బాధపడుతున్న పదిశాతం కంటే తక్కువ మంది టీకా వేసుకున్నారు. 

 సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో 150 మంది, సికింద్రాబాద్‌ యశోదలో 130, మలక్‌పేట యశోదలో 120 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 

 ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో రెండు వందల మందికి వ్యాక్సిన్‌ వేశారు. 

 గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో 130 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

8 బంజారాహిల్స్‌ స్టార్‌ ఆస్పత్రిలో  30 మందికి టీకాలు వేశారు. 

8 బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో 200 మందికి వ్యాక్సిన్‌ పూర్తి చేశారు. 

 మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో 33 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 

 రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ సరోజినీ ఆస్పత్రిలో టీకాను వేయించుకున్నారు.   


కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించిన సీఎస్‌

మంగళ్‌హాట్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, కలెక్టర్‌ శ్వేతామహంతితో కలిసి ఆస్పత్రికి వచ్చిన ఆయన వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన వారితో, సిబ్బంది, అధికారులతో మాట్లాడారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగుతోందని తెలిపారు.  




Updated Date - 2021-03-02T06:47:52+05:30 IST