Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో మల్లన్నను  అరెస్ట్ చేయాలన్న,  మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని తెలిపింది.  డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు నమోదు చేసిన తరువాత  41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని పేర్కొంది. మల్లన్నపై ఉన్న 35 కేసులపై న్యాయవాది దిలీప్ సుంకర  వాదనలు వినిపించారు.  బెయిల్ పిటిషన్‌పై రేపు మరోసారి హైకోర్టులో మల్లన్న తరుపు న్యాయవాది వాదనలు వినిపించున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement