కాంటాక్ట్‌లెస్‌ థర్మల్‌ స్కానింగ్‌కు ఏఐ పరికరం.. టెక్ స్టార్టప్ ఆర్‌వీ సృష్టి

ABN , First Publish Date - 2020-07-11T23:32:34+05:30 IST

కోవిడ్‌–19 విజృంభిస్తున్న తరుణంలో అనేక ఆఫీసుల్లో థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పరికరాలన్నింటినీ...

కాంటాక్ట్‌లెస్‌ థర్మల్‌ స్కానింగ్‌కు ఏఐ పరికరం.. టెక్ స్టార్టప్ ఆర్‌వీ సృష్టి

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 విజృంభిస్తున్న తరుణంలో అనేక ఆఫీసుల్లో థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పరికరాలన్నింటినీ ఎవరో ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఆరోగ్య కార్యకర్తలు కానీ దాని దగ్గర ఉండి ఆఫీసుకు వచ్చి పోయేవారిని టెంపరేచర్‌ చెక్ చేయాల్సి వస్తుంది. అయితే వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా ఉంటే వీరికి కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌ ఆర్‌వీ ఇప్పుడు ‘థర్మల్‌ స్క్రీనింగ్‌ కియోస్క్‌’లను ఆవిష్కరించింది. ఈ మేరకు సంస్థ కో–ఫౌండర్‌ సుశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ఈ కియోస్క్‌లు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో పనిచేస్తాయని, ఫేసియల్‌ రికగ్నైజేషన్‌, ధర్మల్‌ స్క్రీనింగ్‌లతో పాటు మాస్క్‌ ధరించని వారి సమాచారం కూడా వెంటనే తెలియజేస్తాయని వివరించారు.


అంతేకాకుండా ఈ పరికరాల్లో ఆటో హ్యాండ్‌ శానిటైజేషన్‌, అటెండెన్స్‌/యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ సదుపాయాలు కూడా ఉన్నాయని, అలాగే వ్యక్తుల టెంపరేచర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌, పల్స్‌, రెస్పిరేషన్‌ రేట్‌ కనుగొనే సదుపాయాలు కూడా దీనిలో ఉన్నాయని ట్లు తెలిపారు. ఈ థర్మల్‌ స్క్రీనర్ల ధర రూ.60వేల నుంచి రూ.1.25 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు.

Updated Date - 2020-07-11T23:32:34+05:30 IST