అధ్యాపకులు భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2022-07-04T04:55:33+05:30 IST

విద్యార్థుల శ్రేయస్సుకోసం అధ్యాపకు లు భాగస్వా మ్యం కావాలని ఆర్‌జేడీ సీఈ డాక్టర్‌ నాగలింగారెడ్డి అన్నారు.

అధ్యాపకులు భాగస్వామ్యం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ నాగలింగారెడ్డి

ఆర్‌జేడీ సీఈ డాక్టర్‌ నాగలింగారెడ్డి

కడప వైవీయూ, జూలై 3: విద్యార్థుల శ్రేయస్సుకోసం అధ్యాపకు లు భాగస్వా మ్యం కావాలని ఆర్‌జేడీ సీఈ డాక్టర్‌ నాగలింగారెడ్డి అన్నారు. ఆదివారం వైవీయూలో కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజ్‌ఎట్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు ఐదు రోజులు వైవీయూలో ఎఫ్‌ఐపీ ఐదో రోజు ముగిసింది. కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు వివిధ అంశాలపై అవగాహన కలిగించిన ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు శిక్షణ అనంతరం తమ విద్యాబోధనపై పూర్తి శ్రద్ధ వహించాలని విద్యార్థుల జీవితాలను చక్కదిద్దాలన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మరెన్నో జరిగి తే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.

డాక్టర్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ అధ్యాపకులకు ఐదు రోజులు తాము శిక్షణ ఇచ్చామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి విద్యార్థుల అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు. కోటిరె డ్డి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుబ్బలక్షుమ్మ, వైవీయూ సీడీసీ డీన్‌ డాక్టర్‌ సుబ్బరాయుడు, వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, రిసోర్స్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ షావలిఖాన్‌, అకడమిక్‌సెల్‌ ప్రతినిధులు పాల్గొని అధ్యాపకులకు బోధనపట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T04:55:33+05:30 IST