ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2020-11-30T05:05:51+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఎస్సీఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
మాట్లాడుతున్న పోతల దుర్గారావు

గుజరాతీపేట: ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా  చేపట్టాలని ఎస్సీఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇల్లిసిపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ, జిల్లాలో పాఠశా లలు, ఉపాధ్యాయుల పోస్టులు పోకుండా  ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు చైల్డ్‌ ఇన్ఫో సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. ప్రాథమిక, యూపీ పాఠశా లల్లో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బి.రవికుమార్‌ పాల్గొన్నారు.  

 

అన్ని ఖాళీలను  ప్రదర్శించాలి

 పోస్టులను బ్లాక్‌ చేయకుండా అన్ని ఖాళీలను ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ప్రదర్శించాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము అప్పలరాజు, పేడాడ కృష్ణారావులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావే శంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోత ధర్మారావు పాల్గొన్నారు.


సమాన విద్యావకాశాలు కల్పించాలి

కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ టెంక చలపతిరావు డిమాండ్‌ చేశారు. నూతన విద్యా విధానం-2020ను వ్యతిరేకిస్తూ ఆదివారం  నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన, కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేప ట్టారు. ఆరోతరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టే విధానాన్ని విడనాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు, నాయకులు వాన కామేశ్వరరావు, కొమ్ము అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-30T05:05:51+05:30 IST