తప్పుడు సమాధానం చెప్పిన బాలికను మందలించడానికి పిలిచిన టీచర్.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-18T08:10:47+05:30 IST

విద్యార్థులను తండ్రిలా కాపాడాల్సిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పుడు సమాధానం చెప్పిందనే కారణం చెప్పి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అడగడానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించాడు...

తప్పుడు సమాధానం చెప్పిన బాలికను మందలించడానికి పిలిచిన టీచర్.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..

విద్యార్థులను తండ్రిలా కాపాడాల్సిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పుడు సమాధానం చెప్పిందనే కారణం చెప్పి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అడగడానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న టీచర్.. ఎనిమిదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పుడు సమాధానం చెప్పిందనే కారణంతో ఆమెను స్టాఫ్ రూమ్‌కు పిలిచి లైంగిక వేధింపులకు దిగాడు. ఆమె ప్రైవేట్ భాగాలను తాకాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. 


జరగిన ఘటనపై వారు ఆ టీచర్‌ను ప్రశ్నించారు. వారిపై కూడా టీచర్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-04-18T08:10:47+05:30 IST