పదవులు.. ఊరింపులు

ABN , First Publish Date - 2020-10-27T17:46:36+05:30 IST

ప్రధాన రాజకీయ పక్షాలు దసరా పండక్కి ముందే పదవుల పందేరం పేరిట ఊరిం చాయి. కొన్ని పార్టీలేమో జిల్లాస్థాయి అధ్యక్షులను నియమించి..

పదవులు.. ఊరింపులు

టీడీపీలో కొలిక్కి రాని కూర్పు

సామాజిక వర్గాల మధ్య సమతుల్యత

అందుకే ఆలస్యమైందని ప్రచారం

కమలంలోనూ ఇదే తరహా కసరత్తు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): ప్రధాన రాజకీయ పక్షాలు దసరా పండక్కి ముందే పదవుల పందేరం పేరిట ఊరిం చాయి. కొన్ని పార్టీలేమో జిల్లాస్థాయి అధ్యక్షులను నియమించి మిగతా కార్యవర్గాన్ని ఎంపిక చేయకుండా ఊరించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అధికార  వైసీపీ పండుగకు ముందే బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం పూర్తి చేసింది. పదవుల పందేరంలో మిగతా పార్టీలకంటే వైసీపీ ముందుంది. తెలుగుదేశం, బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా కమిటీల్లో ఇప్పటి వరకూ అధ్యక్షులను నియమించాయే తప్ప కార్యవర్గాలపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. దసరా నాటికైనా ఇవన్నీ చేతికందితే బాగుండునని అనేక మంది ఆశతో ఎదురుచూసినా మరికొంత కాలం ఆగండి అంటూ ప్రధాన పక్షాలు ఊరిస్తూనే ఉన్నాయి.


తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాల్లో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవలే పార్లమెం టరీస్థాయి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టిం ది. ఏలూరు పార్లమెంటరీ స్థానానికి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నరసాపురం పార్లమెంటరీ స్థానానికి అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. రెండుచోట్లా పూర్తిస్థాయి కమిటీలకు వీలుగా దిశా నిర్ధేశం చేశారు. పండుగ నాటికే కసరత్తు పూర్తి చేసి అధిష్ఠానం అనుమతి తీసుకుని అధికారిక ప్రకటన కు వీలుగా సన్నాహాలు చేశారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 27 మందితో కూడిన కార్యవ ర్గంతో కమిటీకి రూపు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలుగా సూచించారు. అధిష్ఠానం సూచించిన విధంగా ఒక్కో జిల్లా కార్య వర్గం 27 సంఖ్యలోపే ఉండేలా అది కూడా అత్యధి కంగా యువతతో నిండేలా చూడాలని నిర్ధేశించారు. చురుకైన అధికార ప్రతినిధులను నియమించాల్సిం దిగా సూచనలు, మార్గదర్శకాలు జారీచేసింది.


ఏలూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్‌ నేత పాలి ప్రసాద్‌తోపాటు జంగారెడ్డిగూడెం నుంచి రామ్‌కు మార్‌ సహా పలువురి పేర్లను పరిశీలనలోకి తీసు కుంటున్నారు. అనుబంధ సంఘాల్లో కీలకంగా పని చేసిన వారికి ఈ సారి పార్లమెంటరీ పార్టీ కమిటీలో చోటు ఇవ్వాలని  సంకల్పించారు. టీడీపీలో పలువు రు సీనియర్లతోపాటు యువత ఆయా స్థానాలకు పోటీ పడుతున్నారు. నరసాపురం పార్లమెంటరీలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ పార్టీ బలంగా ఉండగా కన్వీనర్ల సిఫారసులతోపాటు, పార్టీలో కష్టించి పనిచేస్తున్న వారిని ఆయా కమిటీల్లో నియ మించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలను కొంత ప్రక్షాళన చేసి కొంత మంది కొత్త వారికి నియోజకవర్గ కన్వీనర్లుగా అవకాశం కల్పించవచ్చు. భీమవరంలో ఇప్పటికే మెంటే పార్థసారథి లాంటి వారు ఉన్నా కోళ్ళ నాగేశ్వరరావు వంటి యువనేతలు అనేక సందర్భాల్లో పార్టీకి అండగా, మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పదవులు ఇచ్చే క్రమంలో పార్లమెంటరీ పార్టీ నుంచి సిఫార్సులు చేస్తే వీటన్నింటిని వడపోసి సమ్మతమైన వారితో పూర్తిచేసి అధిష్ఠానమే ఆమోదముద్ర వేయబోతోం ది. పది రోజుల్లో ఇది జరగబోతున్నట్టు సమాచారం. 


కమలంలోనూ ఇంకా కసరత్తే 

బీజేపీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కమిటీల్లో పూర్తిస్థాయి కూర్పు పూర్తి చేయలేదు. పార్టీలో అనేకమంది సీనియర్లు ఈ కమిటీల కోసం ఎదురుచూస్తున్నారు. ఏలూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా సుధాకరకృష్ణ, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా తాతాజీని నియమించారు. ఈ రెండు కమిటీల పూర్తి కార్యవర్గాలు ఇప్పటికీ ఒక రూపు రాలేదు. ఏలూరు కమిటీలో సామాజిక వర్గాలు, పా ర్టీకి విధేయతతో సేవచేసిన వారిని గుర్తించి ఎంపిక చేయాలని ఇప్పటికీ కుస్తీలు పడుతూనే ఉన్నారు.  ఇంతకు ముందు వివిధ నియోజకవర్గాల అభ్యర్థు లుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారితోపాటు అనేక మంది సీనియర్లు తమకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిఽధిలో తాతాజీ ఇప్ప టికే కసరత్తు కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్‌ నేత కపర్ధి, పేరిచర్ల శ్రీనివాసరాజు, పాకా సత్యనారాయణ వంటి సీనియర్లతోపాటు, సిఫార్సుల తో మరికొందరికి అవకాశం ఇస్తారనే భావిస్తున్నారు.

Updated Date - 2020-10-27T17:46:36+05:30 IST