ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయరా?: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2020-08-15T21:45:24+05:30 IST

ఎన్నికల ముందు తమ పార్టీకి అధికారం కట్టబెడితే కేంద్రాన్ని నిలదీసి..

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయరా?: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు తమ పార్టీకి అధికారం కట్టబెడితే కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్‌ ఆ విషయమే మర్చిపోయారని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.   22 మంది ఎంపీలు ఉన్నా జగన్‌ కేంద్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.


కేంద్రంపై ఒత్తిడి తెస్తే సీబీఐ కేసుల్లో జైల్లో పెట్టిస్తారనే భయంతోనే జగన్‌ ప్రత్యేక హోదాను విస్మ రించారని,  ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆరోపించారు. మద్యం, ఇసుక  మాఫియాలను పెంచి పోషించ డంలో ఉన్న శ్రద్ధ ప్రజ లపై లేదని అన్నారు.  కరోనా సమయంలో అ న్ని దుకాణాలను మధ్యా హ్నం వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసి మద్యం దుకాణాలను మాత్రం రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో తనతోపాటు మంత్రులు, వైసీపీ నాయకులు కొనుగోలు చేసిన వేలాది ఎకరాల భూములకు విలువను పెంచుకోవడానికే అక్కడికి రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు.   


Updated Date - 2020-08-15T21:45:24+05:30 IST