టీడీపీ పూర్వవైభవానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:23:14+05:30 IST

టీడీపీ పూర్వవైభవానికి కృషి చేయాలి

టీడీపీ పూర్వవైభవానికి కృషి చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి


కీసర,మే23: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని భోగారం అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు సుంకరి వెంకటేష్‌ అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్ఛేసిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరం 7 లక్షల పార్టీ సభ్యత్వం జరిగిందని, ఈయేడు 10 లక్షల సభ్యత్వాలు చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కందికంటి అశెక్‌గౌడ్‌, కుతాడి రవికూమార్‌, కోండా జంగారెడ్డి, సంజీవగౌడ్‌, లింగం,యాసిన్‌, హరికృష్ణ, బిందు, కోండ సుజాత, రాములు యాదవ్‌, రవికూమార్‌ లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

బషీరాబాద్‌, మే23: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే  రైతులు వరిధాన్యం విక్రయించి మద్ధతు ధర పొందాలని నవాంద్గీ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, మండల ఎస్టీసెల్‌ నాయకులు భాన్సిలాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రవణ్‌కుమార్‌, సీఈవో వెంకటయ్య, సొసైటీ సిబ్బంది బందెయ్య, ఫారుఖ్‌,డైరెక్టర్లు హన్మంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:23:14+05:30 IST