ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం : టీడీపీ

ABN , First Publish Date - 2021-01-14T07:04:50+05:30 IST

వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ నాడు రైతులు సుఖ సంతోషాలతో లేకుండా చేసిందని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం : టీడీపీ
బందరులో రైతు వ్యతిరేక జీవోల ప్రతులను దహనం చేస్తున్న గోపు సత్యనారాయణ

మచిలీపట్నం టౌన్‌, జనవరి 13 :    వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ నాడు రైతులు సుఖ సంతోషాలతో లేకుండా చేసిందని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. టీడీపీ రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఇలియాస్‌ పాషా, ప్రధాన కార్యదర్శి పిప్పళ్ళ కాంతారావు, నాయకులు పి.వి. ఫణికుమార్‌, లంకే శేషగిరి, అంగర తులసీదాస్‌, శివకోటి రాజేంద్రప్రసాద్‌, మురాల ప్రసాద్‌, రాము, లంకే హరికృష్ణ, ఊకంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ టౌన్‌  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అవనిగడ్డలో టీడీపీ నేతలు చట్టాలకు సంబంధించిన ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే రాఘవ, సాయికుమార్‌, రాజశేఖర్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  చల్లపల్లి : వక్కలగడ్డ గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటలలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు.   ఆంధ్రప్రదేశ్‌ రైతు సం ఘం జిల్లా ఉపాధ్యక్షులు హనుమానుల సురేంద్రనాథ్‌ బెనర్జి,  రైతు సంఘం నాయకులు అట్లూరి వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మల్లుపెద్ది రత్నకుమారి,  బోస్‌, బాలమురళీ,  వెంకట కృష్ణ, దాసరి శ్రీనివాస్‌, సుబ్బయ్య,  మాకినేని దుర్గాప్రసాద్‌,   వెంకట సూర్య భాస్కరమ్మ,  అరుణకుమారి,  వెంకటరమణ,  రాణికుమారి పాల్గొన్నారు. బంటుమిల్లి :  రైతు వ్యతిరేక  వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం వేశారు. రైతు సంఘం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, అజయ్‌ఘోష్‌, సుజ్ఞానం జనార్దనరావు, చిటికినేని నాగమల్లి, గంగాధర్‌, నాగిశెట్టి కృష్ణమూర్తి నాగిశెట్టి రమేష్‌, నాంచారయ్య, పెందుర్రు బంటుమిల్లి, అర్తమూరు, సాతులూరు, జానకిరామాపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు. గుడివాడటౌన్‌  : పన్నుల పెంపును నిరసిస్తూ జీవో 196, 197, 198 ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి టి.లక్ష్మణరావు పాల్గొన్నారు. నందివాడరూరల్‌(గుడివాడ): మండలంలోని తుమ్మలపల్లిలో జీవో నెం. 196, 197, 198 ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.  కాపీలను భోగి మంటలకు ఆహుతి చేశారు. 



Updated Date - 2021-01-14T07:04:50+05:30 IST