సమస్యలపై రణం

ABN , First Publish Date - 2022-09-15T05:09:02+05:30 IST

నేటి నుంచి ఐదురోజులపాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సాక్షిగా సమస్యలు లేవనెత్తడానికి ప్రతిపక్ష తెలుగుదేశం సిద్ధపడుతోంది

సమస్యలపై రణం

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

 సమస్యలెన్నో.. పరిష్కారమేదీ ?

 పోరాటానికి టీడీపీ సిద్ధం

 అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టేందుకు రెడీ

 టిడ్కో ఇళ్లు, గోదావరి జలాల పంపిణీ వరకు లేవనెత్తే యత్నం

 వరద సాయం వైఫల్యంపై నిలదీత


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

నేటి నుంచి ఐదురోజులపాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సాక్షిగా సమస్యలు లేవనెత్తడానికి ప్రతిపక్ష తెలుగుదేశం సిద్ధపడుతోంది. ఉమ్మడి పశ్చిమలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నా రైతుల కంట్లో బకాయిల నలుసు. అధికార పక్షం నోరు విప్పదు. ఇక ప్రతిపక్షమే గళం ఎత్తి పరిష్కార బాధ్యతలను భుజానకెత్తుకో వడానికి సర్వ సన్నద్ధమైంది. పరిష్కార మార్గాలు లేక సభలో కాలయాపన చేస్తారా, లేక సమస్యలపై దండెత్తుతున్న వారి నోరు నొక్కేస్తారా ? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన తరుణమిది అంటారు శాసనసభా పక్ష తెలుగుదేశం ఉప నేత నిమ్మల రామానాయుడు. ఆయన వెంటే మరో ఎమ్మెల్యే రామరాజు కూడా. 


పరిష్కారం ఎప్పుడు ?

ఏటా సమస్యలు పెరుగుతున్నా పరిష్కా రాలు శూన్యం. ఈ మధ్య వరదలొచ్చి కుక్కు నూరు, వేలేరుపాడు, పోలవరం, యలమం చిలి, నరసాపురం, ఆచంట వంటి మండలాల పరిధిలో భారీ నష్టం జరిగింది. పోటెత్తిన వరద ముందు సహాయక చర్యలు అంతంత మాత్రంగా సాగాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌ వరద ప్రాంతాల్లో పర్యటించి చాలా రోజులు కావస్తున్నా అందాల్సిన సాయం నేటికీ దిక్కులేదు. ముంపు మండలాల్లో నష్టపోయిన గృహాలకు పరిష్కారం చెల్లిం పులో అనేక అనుమానాలు, మరెన్నో చేతి వాటాలు కనిపించాయి. సర్వం కోల్పోయి న బాధితులకు న్యాయం చేయాల్సిన చోట.. దీనికి విరుద్దంగా కోట్లలో ఖర్చ య్యిందంటూ వరద పద్దులు వేశారు. నిల దీస్తున్న వారిపై కేసులు నమోదు చేశా రు. ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సమాధా నమే కరువైంది. ఇంత చేస్తే రెండు మాసాల్లో వరుస వరదలతో నష్టపోయి న కుటుంబాలన్నీ ఇప్పటికే వీధిన పడ్డాయి. చేతిలో చిల్లి గవ్వ లేక, పనిలేక విలవిలలాడుతున్నా సర్కారు కనికరించ లేదు. ముంపు పరిహారం విషయంలో ఇచ్చిన హామీలను గోదాట్లో కలిపేశారు. జిల్లాలో నలుదిక్కులా రహదారులు అధ్వా న్నం. గుంతలు పడిన రహదారుల్లో అనేక ప్రమాదాలు. మృతి చెందిన, క్షతగాత్రుల సంఖ్య వందల్లోనే. రోడ్లు వేయండి మహా ప్రభో అంటూ విపక్షాలు రహదారుల గుంత ల ముందే బహిరంగ దీక్షలు చేసినా స్పందన కరవు. ఈ విషయాలన్నింటినీ అసెంబ్లీలో లేవనెత్తేందుకు మరోసారి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, మరో పది మంది అధికార పక్ష శాసనసభ్యులు ఉండగా కేవలం ఇద్దరే ఇద్దరు తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా అసెంబ్లీలో ప్రజా సమస్యలను వీలైతే లేవనెత్తడానికి వారంతా ఇప్పటికే సంసిద్ధమయ్యారు. రహదారుల మరమ్మతులు, వరద బాధితులకు సాయం అందని తీరు, టిడ్కో ఇళ్ళు, ఇప్పటికే పక్కా ఇళ్ళ నిర్మాణం సాగకపోవడం, మంజూరైన మెడికల్‌ కళాశాలకు పూర్తిస్థాయి మోక్షం లభించకపోవడం, నిధుల కొరత, ఆక్వా ఇబ్బందులు, నిర్వహణ లేని కాల్వలు వంటి అంశాలన్నింటినీ శాసన సభా వేదికగా లేవ నెత్తేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. ‘ఎన్నో సార్లు విన్నవించినా ఏ సమస్యకు పరిష్కారం లేకపోయింది. అయి నప్పటికీ ప్రజా మద్దతుతో వారి ఆందోళనల్లో భాగం పంచుకుంటూ, పోరాటాలు చేస్తూ సర్కారు కళ్లు తెరిపించేందుకే ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయినా అధికార పక్ష ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ ఒక్కరికి జిల్లా పట్టలేదు. ఇదేం దౌర్భాగ్యం’ అంటూ విపక్ష పార్టీ జిల్లా నేతలం తా ఆగ్రహంతో ఉన్నారు. అసలు సమస్యలు కోకొల్లలు.. పరిష్కారం లేకపోవడం అందరిని గుక్కపట్టిస్తోంది. ఆక్వాకు సంబంధించి వేల మంది రైతులు ఆధారపడ్డారు. వారి కింద వ్యవసాయ కూలీలు వేల సంఖ్య లో బతుకీడ్చుకొస్తున్నారు. వీరందరికీ ఆయువు పట్టు అయిన ఆక్వాను ప్రోత్స హిస్తామని చెబుతూనే మరోవైపు సబ్సిడీల్లో కోత పెడుతున్నారు. ఈలోపు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో భిన్న పరిస్థితు లు నెలకొనడంతో ఆక్వా రంగం నష్టాలను పోగేసుకుంది. ఆదుకో వాల్సిన సర్కారు రైతులకు మద్ద తుగా ఉండాల్సింది పోయి సబ్సి డీలు ఎత్తివేయడంపై ఆక్వా రైతు లు రగిలిపోతున్నారు. ధాన్యం సేక రణ జరిగి చాలా కాలమైనా ఇప్పటికీ వందల మంది రైతులకు వైసీపీ సర్కా రు బకాయి పడింది. ఇదేమని రైతులు ప్రశ్ని స్తున్నా బుకాయింపు తప్ప ధాన్యం సేకరణ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. ఉమ్మడి పశ్చిమలో దాదాపు రూ.60 కోట్లకు పైబడే ఈ బకాయిలు ఇప్పటికీ పేరుకుపో యాయి. డెల్టా గ్రామాల ప్రజలకు గోదావరి జలాలు అందిస్తామని ప్రకటించి రెండున్న రేళ్ళు అవుతోంది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు నిధులు లేవు. కార్యాచరణ అమలు లేదు. డెల్టా కాలువలు నిర్వహణ లోపంతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారాయి. దీంతో క్రాప్‌ హాలిడే వైపు రైతులు తొంగి చూశారు. ఇలాంటి సమస్యలెన్నో అధికార పక్ష ఎమ్మెల్యేల దృష్టికి వెళ్తున్నా పరిష్కారం ఇప్పటికీ శూన్యమే. ఈ ప్రధాన సమస్యలన్నింటిపైనా అసెంబ్లీలో లేవనెత్తుతామని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెబుతున్నారు.


అసెంబ్లీనే వేదిక.. నిలదీస్తాం 

నిమ్మల రామానాయుడు, శాసన సభా పక్ష టీడీపీ ఉప నేత

ఉమ్మడి పశ్చిమలో అనేక సమస్యలున్నాయి. ఈ మూడేళ్ళల్లో పరిష్కారం సున్నా. మెడికల్‌ కళాశాల లకు నిధులు సమకూర్చడం లేదు. కాల్వల నిర్వహణ అథోగతి. టిడ్కో ఇళ్ళు పంపిణీ చేస్తామన్నా చాలాచోట్ల పెండింగే. ఆర్భాటంగా కట్టిస్తామన్న పక్కా ఇళ్ళ నిర్మాణం ఈ ప్రభుత్వంలో ముందుకు సాగడం లేదు. ఇంటింటికీ గోదావరి జలాలు అన్నారు.. ఏవి ఎక్కడ ? వరద బాధితులను కనీసం ఆదుకోలేదు. తూతూ మంత్రంగా సాయం ప్రకటించారే తప్ప అందించనే లేదు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఈ అసెంబ్లీ  సమావేశాల్లో వీలు చిక్కితే నిలదీస్తాం.


Updated Date - 2022-09-15T05:09:02+05:30 IST