Abn logo
Oct 27 2020 @ 05:21AM

సన్నరకం ధాన్యం రూ.2500 ధర ప్రకటించాలి

పంటలను పరిశీలించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ


సారంగాపూర్‌, అక్టోబరు 26 : ప్రభుత్వం సన్నరకం వరికి క్వింటాలుకు రూ. 2500 ధర ప్రకటించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని నాగునూరు, లచ్చక్కపేట గ్రామాలలో వర్షం, దోమపోటుతో నష్టపోయిన పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్వయంగా తెలంగాణ సోనాకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటదని తెలంగాణ సోనా రకం వరిని సాగు చేయాలని ప్రోత్సహించడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంటను సాగు చేశారన్నారు. తెలంగాణ సోనా రకం దోమ పోటును తట్టుకోక, అకాల వర్షంతో పాటు తాలు, తప్పతోనే పెరిగిందన్నారు. పూర్తి స్థాయిలో పంట దిగుడబడి రాదన్నారు. పెట్టిన పెట్టుబడులు  వచ్చే పరిస్థితులు లేవన్నారు. నిజమైన పేద రైతు కన్నీళ్లతో తమ పంటలను తగుబెట్టుతుంటే భూస్వాములు, ధనిక రైతుల ఖాతాలో రైతుబంధు జమవుతుందలన్నారు. సన్న రకం ధాన్యానికి 2500 రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  లేనిపక్షంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు యాదాగౌడ్‌, మహాంకాళీ రాజన్న, అనంతుల గంగారెడ్డ్డి, వినోద్‌కుమార్‌, వొల్లాల గంగాధర్‌, నిరంజన్‌, పులి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement