వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2021-07-25T05:55:27+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
ఉయ్యూరు- కాటూరు రోడ్డులో గోతుల వద్ద నిరసన తెలుపుతున్న కొనకళ్ల, బోడె ప్రసాద్‌

  రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వ హత్యలే

  మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ 

ఉయ్యూరు, జూలై 24 : కోట్లాది రూపాయలు రోడ్డు చెస్‌గా  వసూలు చేస్తున్న ప్రభుత్వం రోడ్ల బాగుజేతకు నిధులు కేటాయించకపోవడం బాధాకర మని, వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వ నాశనమవుతున్నదని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎంపీ  కొనకళ ్ల నారాయణ విచారం వ్యక్తం చేశారు. రోడ్ల అధ్వాన స్థితిపై నిరసన తెలుపుతూ పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి బోడెప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉయ్యూరు - కాటూరు రోడ్డులో గోతుల వద్ధ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం నుంచి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం నష్టపోయిందని, విద్య, వైద్యం నాశనమై పోగా రోడ్లు మరమ్మతులకు కూడా నోచుకోలేదన్నారు. రోడ్డు చెస్‌గా రూ.1200 కోట్లు వసూలు చేస్తూ రోడ్ల బాగుజేత, అభివృద్ధి ఊసేలేదని, గోతులమయంగా తయారైన రాష్ట్ర రోడ్లపై ప్రమాదాలు జరిగి పలువురు మరణించగా, అనేక మంది గాయాలపాలవుతున్నా రన్నారు. రోడ్డు ప్రమాదాలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. అప్పులు చేసి నిధులు దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని దుయ్య బట్టారు. చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉండగా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చారని, అనేక రోడ్లు జాతీయ రహదారులుగా మార్చారని గుర్తుచేశారు.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసేందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం రోడ్ల బాగుజేతకు రూపాయికూడా వెచ్చించక పోవడం దురదృష్టకరమని బోడె ప్రసాద్‌ విమర్శించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల ఉపాధికి ఉపయోగపడేలా ప్రభుత్వం పాలన చేస్తుందని, పెనమలూరు నియోజకవర్గంలో పేదల ఇళ్లస్థలాల భూములు కొనుగోలులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టక పోతే  ప్రజాఉద్యమం చేస్తామని కాగిత కృష్ణప్రసాద్‌ ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. తెలుగు యువత నాయకుడు డి.చౌదరి, ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు వై. కుటుంబరావు, ఉయ్యూరు పట్టణ అధ్యక్షుడు గుర్నాధరావు, జబర్లపూడి, ఆకునూరు, మర్రివాడ సర్పంచ్‌లు సూరపనేని శేషవరప్రసాద్‌, గోలి వసంతకుమార్‌, ఫ్రాన్సిస్‌, నగర పంచాయతీ మాజీ చైర్మన్‌ ఖుద్దూస్‌, దేవినేని రాజా, వెలగపూడి శంకరబాబు, జయదేవ్‌, చిరంజీవి, రఫీ, పొగిరి రాము పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

గన్నవరంలో..

గన్నవరం :  రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా గోతుల మయంగా ఉన్నాయని, ప్రభుత్వం గోతుల్లో తట్టెడు మట్టి కూడా పోయడంలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా విమర్శించారు. రెండేళ్ల వైసీపీ పాలనలో గోతులు పూడ్చలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంద న్నారు.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి  చంద్రబాబు పిలుపు మేరకు గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సమీపంలో గన్నవరం - మానికొండ ఆర్‌ అండ్‌ బీ రోడ్డుపై ఉన్న గోతుల వద్ద  పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా రోడ్ల నిర్వహణపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. 

అనంతరం రాష్ట్ర కార్యదర్శి చిన్నా మాట్లాడుతూ, రాష్ట్రం లోని రహదా రులు నరకదారులుగా మారాయని విమర్శిం చారు. ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ ప్రాంతాల రోడ్లను కూడా నిర్వహించలేని దుస్థితిలో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు,  పుట్టా సురేష్‌,  కంభం పాటి సుభాష్‌ చంద్రబోస్‌, నిమ్మకూరి మధు, మురళీ,  మొవ్వా వెంకటేశ్వరరావు,  మూల్పూరి సాయి కల్యాణి,   మండవ లక్ష్మీ, చిక్కవరపు నాగమణి, చీమలదండు రామకృష్ణ, మండవ అన్వేష్‌, బాలు, నిమ్మకూరి జయ మోహన్‌,   పల్లగాని కల్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:55:27+05:30 IST