భూ సేకరణలో వైసీపీ దందా

ABN , First Publish Date - 2020-07-08T09:43:28+05:30 IST

పేదల ఇళ్ల స్థలాలకు భూ సేకరణ, పంపిణీలో వైసీపీ నాయకుల దందా చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

భూ సేకరణలో వైసీపీ దందా

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


బుచ్చెయ్యపేట, జూలై 7: పేదల ఇళ్ల స్థలాలకు భూ సేకరణ, పంపిణీలో వైసీపీ నాయకుల దందా చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ‘ఊరికి దూరంగా.. లబ్ధిదారులకు భారంగా’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 1న ప్రచురితమైన కథనంతో మంగళవారం బుచ్చెయ్యపేట, ఐతంపూడి, నీలకంఠాపురం గ్రామాల్లో లే అవుట్‌లను ఆయన పరిశీలించారు. ఐతంపూడి నుంచి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు వీడియో కాల్‌ ద్వారా లే అవుట్‌ల పరిస్థితిని వివరించారు. అనంతరం విలేకరులతో బుద్ద మాట్లాడుతూ ఐతంపూడి, నీలకంఠాపురం గ్రామాల్లో లే అవుట్‌లు శ్మశాన వాటిక సమీపంలో వేయడం దారుణమన్నారు.


బుచ్చెయ్యపేటలో కోర్టు పరిధిలో ఉన్న మోడల్‌ స్కూల్‌ భూమిని ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయడం అన్యాయమన్నారు. మండలంలో టీడీపీ సానుభూతి పరుల భూములను సేకరించిన అధికారులు, అధికార పార్టీకి చెందిన భూముల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ బత్తుల తాతయ్యబాబు, నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సుంకర సూరిబాబు, ఎం.తాతయ్యలు, గొలగాని రాజారావు, కె.సత్యనారాయణ, ఎం.బుజ్జి, వై.అప్పలనాయుడు ఉన్నారు.

Updated Date - 2020-07-08T09:43:28+05:30 IST