తరలిన తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-05-27T07:10:19+05:30 IST

ఒంగోలులో మహానాడు పండగకు జిల్లానుంచి వేలల్లో టీడీపీ శ్రేణులు కదిలాయి. చాలా ఏళ్ల తర్వాత వేడుక జరు గుతుండడంతో వెళ్లి తీరాలనే పట్టుదలతో భారీగా అన్ని నియోజకవర్గాలనుంచి నేతలు, క్యాడర్‌ బయలుదేరారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు భారీగా క్యూకట్టాయి. వీటిని పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారం భించారు.

తరలిన తమ్ముళ్లు

  • ఒంగోలు మహానాడుకు జిల్లానుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
  • ఒక్కో నియోజకవర్గం నుంచి వందల్లో బయలుదేరిన క్యాడర్‌
  • మహానాడు కోసం నియోజకవర్గాలవారీగా బస్సులు ఏర్పాటు చేసిన ఇన్‌ఛార్జులు
  • పంపొద్దంటూ ఆపరేటర్లపై వైసీపీ నేతల ఒత్తిళ్లు
  • అనేక బస్సులు వెనక్కు రప్పించిన యజమానులు
  • అయినా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లలో వేలల్లో తెలుగు తమ్ముళ్ల పయనం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఒంగోలులో మహానాడు పండగకు జిల్లానుంచి వేలల్లో టీడీపీ శ్రేణులు కదిలాయి. చాలా ఏళ్ల తర్వాత వేడుక జరు గుతుండడంతో వెళ్లి తీరాలనే పట్టుదలతో భారీగా అన్ని నియోజకవర్గాలనుంచి నేతలు, క్యాడర్‌ బయలుదేరారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు భారీగా క్యూకట్టాయి. వీటిని పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారం భించారు. వాస్తవానికి ఒక్కో నియోజకవర్గం నుంచి సాధ్య మైనంత తక్కువ మందిని మహానాడుకు పంపాలని పార్టీ సూచించింది. మరీ ఎక్కువైతే అన్ని జిల్లాలనుంచి వచ్చే లక్షలమంది కార్యకర్తలకు వసతి ఏర్పాట్లు ఇబ్బంది అవుతా యని పేర్కొంది. కానీ కొవిడ్‌ కారణంతో కొన్నేళ్లపాటు జరిగిన మహానాడు ఇప్పుడు జరుగుతుండడంతో మండలాల్లో క్యాడర్‌ మహానాడుకు భారీగా వెళ్లడానికి నిర్ణయించారు. నియోజక వర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలనుంచి బస్సు ఏ ర్పాట్లు ఉన్నా లేకపోయినా అనేకమంది గురువారం మధ్యాహ్నం ఒంగోలు బ యలుదేరారు. అటు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇన్‌ ఛార్జులు ఐదేసి బస్సులు, కార్లు సిద్ధం చేశారు. అం తా శుక్రవారం ఉదయాన్నే నియోజకవర్గాలనుంచి వెళ్ల డానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు బస్సులకు అడ్వాన్సులు కూడా చెల్లించారు. కానీ వైసీపీ ఎక్కడికక్కడ బస్సు ఆపరేటర్లపై అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చింది. మహానాడు కు బస్సులు పంపొద్దని బెదిరించింది. దీంతో వెళ్లడానికి అం గీకరించిన ఆపరేటర్లు భయపడి సర్వీసు రద్దు చేసుకున్నారు. దీంతో పిఠాపురం, కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు, కాకినాడ త దితర నియోజకవర్గాలనుంచి ప్రయాణాన్ని గురువారం సా యంత్రానికి మార్చుకుని సొంత కార్లు, ఆర్టీసీ బస్సులు, రైళ్ల లో బయలుదేరారు. దీంతో జిల్లావ్యాప్తంగా కొన్ని వేలమంది మహానాడుకు కదలినట్లయింది. అనేక నియోజకవర్గాల్లో క్యాడర్‌ అయితే రవాణా ఏర్పాట్లతో సంబంధం లేకుండా సొంతంగా రైళ్లలో వెళ్లారు. దీంతో జిల్లా మీదుగా వెళ్లే అన్ని రైళ్లు గురువారం కిక్కిరిశాయి. మరోపక్క మాజీ హోంమంత్రి రాజప్పతోపా టు జ్యోతుల నెహ్రూ, వర్మ, రాజా, కొండబాబు, వరుపుల రాజా తదితర గురువారమే ఒంగోలుకు చేరుకు న్నారు. ఒంగోలు మహా నాడు వేదికనుంచి టోల్‌గేట్‌ వరకు కొన్ని కిలోమీటర్ల మేర జిల్లా తరఫున అత్యంత భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంది. పార్టీ జిల్లా నాయ కుడు గుణ్ణం చంద్రమౌళి ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో భారీ కటౌట్‌లు కట్టారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేష్‌ ఫొటోలు ఉన్న కటౌట్‌లు ఆకర్షణగా నిలిచాయి. మరోపక్క జిల్లా తరఫున కొందరు నేతలకు మహానాడు నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. తీర్మానాల కమిటీలో యనమల, భోజన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతల్లో రాజప్పను చేర్చారు. చాలాకాలం తర్వాత ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు జిల్లానుంచి అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని బస్సులు కూడా మాట్లాడుకుంటే వైసీపీ నేతలు బెదిరించి అన్నింటినీ రద్దు చేయించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు భారీగా వచ్చే వారిని చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

Updated Date - 2022-05-27T07:10:19+05:30 IST