ధరలు తగ్గించాలని టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-08-28T19:07:43+05:30 IST

ప్రకాశం: పెరిగిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీలు, నిరసన చేపట్టాయి. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ ఒంగోలులో టీడీపీ రాష్ట్ర

ధరలు తగ్గించాలని టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ

ప్రకాశం: పెరిగిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీలు, నిరసన చేపట్టాయి. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ ఒంగోలులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ వర్షంలోనే ఆందోళన చేపట్టారు. అలాగే కనిగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 


సింగరాయకొండలో పాకల రోడ్డు నుంచి కందుకూరు ఎన్టీఆర్ బొమ్మల సెంటర్ వరకు నాయకులు ర్యాలీ చేశారు. కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, దామచర్ల సత్య, టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. మరోవైపు గిద్దలూరులో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. 


నాయకులు మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రాలు ధరలు తగ్గిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజలను దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలియజేశారు. పెరిగిన ధరలకు నిరసనగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. అలాగే అద్దంకిలో తహసీల్దార్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఇంకొల్లులో నేతలు భారీ చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ధరలతో సామాన్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-28T19:07:43+05:30 IST