Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల లేఖ

ప్రకాశం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేక రాశారు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదులను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో కూడా వారు వెలిగొండ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లా ప్రజల మనోభావాలు, కోస్తా జిల్లాల ప్రజలు ఏమనుకుంటున్నది తదితర వాటిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 


ప్రకాశం జిల్లా రైతులకు వరప్రదాయనిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, నీటి కేటాయింపులు కూడా జరపొద్దని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డుకు లేఖ రాయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెప్పడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేదని, ఈ ప్రాజెక్టు చేర్చాలని జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేయకపోవడం పట్ల ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని టీడీపీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలకు ప్రజలు, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదన్నారు.

Advertisement
Advertisement