కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించిన టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-08-07T06:22:54+05:30 IST

రామడుగు వాగులో నిర్మించిన వంతెన వర్షాలకు కూలిపోగా శనివారం టీడీపీ నాయ కులు పరిశీలించారు.

కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించిన టీడీపీ నాయకులు
వంతెనను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

రామడుగు, ఆగస్టు 6: రామడుగు వాగులో నిర్మించిన వంతెన వర్షాలకు కూలిపోగా శనివారం టీడీపీ నాయ కులు పరిశీలించారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడు తూ తాటి వనాలకు వెళ్లేందుకు గౌడ కులస్తు లు, రైతులు, ప్రజలు  40 సంవత్స రాల నుంచి ఇబ్బంది పడుతుండడం తో చొప్పదండి ఎమ్మెల్యే వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు 26 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. అయితే బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కూలిపోయిందని ఆరోపించా రు. అధికారులు పూర్తిగా బాధ్యత వహించి కాంట్రాక్టర్‌ సొంత డబ్బులతో బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పూరెళ్ల గోపాల్‌గౌడ్‌, జిల్లా నాయకులు కోరె గట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి అనుపురం వెంకటేశ్‌గౌడ్‌, టీఎన్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు పూరెల్ల మనోజ్‌గౌడ్‌, జిల్లా నాయకులు కిషన్‌, పూరెల్ల శివ, గంటె సుమన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:22:54+05:30 IST