TDP Leaders Arrest: అనంతపురంకు ఎంపీ గోరంట్ల.. టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు

ABN , First Publish Date - 2022-08-14T15:56:48+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురంకు వస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

TDP Leaders Arrest: అనంతపురంకు ఎంపీ గోరంట్ల.. టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు

అనంతపురం (Anantapuram): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) అనంతపురంకు వస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు (TDP leaders House Arrest) చేస్తున్నారు. చంద్రదండు ప్రకాష్ నాయుడు, అనంతపురం జిల్లా పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి సరిపూటి రమణకు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోరంట్ల న్యూడ్ వీడియో బాగోతం బయటపడిన తర్వాత మొదటిసారిగా ఎంపీ అనంతపురం వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.


ఏం ఘనకార్యం చేశాడని ఎంపీ మాధవ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ సెల్ ఫోన్ పరిశీలిస్తే నిజమేంటో తేలుతుందన్నారు. కాగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నేతలను తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి పరామర్శించారు. 

Updated Date - 2022-08-14T15:56:48+05:30 IST