రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధర తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-25T05:52:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధర తగ్గించాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధర తగ్గించాలి
ప్రజలకు ధరల భారం వివరిస్తున్న టీడీపీ నాయకులు

భీమవరం అర్బన్‌, మే 24: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధర తగ్గించాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి డిమాండ్‌ చేశారు. 37వ వార్డు లంకపేటలో బాదుడే బాదుడు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు మినహాయింపునిచ్చి ధరలను తగ్గించాలన్నారు. టీడీపీ పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు అసహనంతో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికలో టీడీపీ విజయం ఖాయం అన్నారు. ఎస్సీసెల్‌ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఎద్దు ఏసుపాదం, మామిడిశెట్టి ప్రసాదు, ఎండి నౌషాద్‌, మాదాసు కనకదుర్గ, మైలాబత్తుల ఐజాక్‌ బాబు, నాలాతి రమేష్‌, చల్లబోయిన గోవిం ద్‌, గంట త్రిముర్తులు, బొక్కా సూరిబాబు, అనపర్తి కృష్ణమోహన్‌, యలమంచిలి శ్రీనివాస్‌, దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


నరసాపురం: వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు ఓటుతో బుద్ది చెప్పా లని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని 23వ వార్డులో మంగళవారం బాదుడే బాదుడు నిర్వహించారు. ఇంటింటికి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అసమర్ధత పాలన వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిం దన్నారు. ప్రజలపై పన్నుల భారం తప్ప అభివృద్ధి లేదన్నారు. కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, షేక్‌ హుసేన్‌, మల్లాడి మూర్తి, మౌలాలీ, తిరుమా ని శశిదేవి, రాయుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


వీరవాసరం: నిత్యావసరాల వస్తువుల ధరలను సామాన్య, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో లేకుండా పాలనచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ నాయకులు ప్రజలను కోరారు. బలుసుగొయ్యిపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను, అగ్గిపెట్టెలు, కొవ్వుత్తులను పంచారు. కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, యరకరాజు గోపాలకృష్ణంరాజు, కడలి నెహ్రు, కడలి వాసు, గొర్రె కృష్ణమూర్తి, అడిదల చిరంజీవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:52:37+05:30 IST