శృంగవృక్షంలో నెత్తిన గ్యాస్బండతో ఎమ్మెల్యే నిరసన
పాలకోడేరు, మే 18: అధిక ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విసుగు చెందారని, ధరలు తగ్గాలంటే జగన్ ప్రభుత్వం దిగాల్సిందేనని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శృంగవృక్షంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే రామరాజు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ జగన్ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్ధితే లేదన్నారు. వంట వండుదామంటే గ్యాస్ ధరలు మండిపోతున్నాయన్నారు. లైట్లు వేసుకుందామంటే విద్యుత్ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ఏ గ్రామం చూసినా తాగునీరు సమస్య, డ్రెయినేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కష్టాలు తీరాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, పెన్మెత్స వరప్రసాదరాజు, క్రొవ్విడి దుర్గ, వీరవల్లి వెంకటలక్ష్మీరమణ, ఉండి బాలజీవనరావు, కలిదిండి వెంకటనర్సమ్మ, నడిపూడి అప్పారావు, ఆరేపల్లి నాగలక్ష్మీ, నాగరాజు, కాజా వీరాస్వామి, మల్లేశ్వరరావు, డిఎన్నార్, గోడి పెద్దిరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చినరంగనిపాలెంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న నేతలు భీమవరం అర్బన్: జగన్ పాలనలో అధిక ధరలు, అధిక పన్నులతో బాదుతున్నారని, ప్రజలకు వివరించడానికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. వేండ్ర శ్రీనివాస్ అధ్యక్షతన చినరంగనిపాలెం 11వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ మాట్లాడారు. ఎద్దు ఏసుపాదం, ఎండీ నౌషద్, గునుపూడి తిరుపాల్, మాదాసు కనకదుర్గ, తదితర నాయకులు పాల్గొన్నారు.