మునిసిపల్‌ కాంప్లెక్స్‌ కూలిస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2021-09-29T05:47:27+05:30 IST

ప్రజలు ఓటేసి గెలిపించిన నియోజకవర్గం కంటే... ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సొంత నియోజకవర్గం పాలకొల్లుపైనే ఇటీవల కాలంలో ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విమర్శించారు.

మునిసిపల్‌ కాంప్లెక్స్‌ కూలిస్తే ఊరుకోం
పాదయాత్రలో వ్యాపారులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బండారు

 కక్ష సాధింపు రాజకీయాలు చేయవద్దు 

 వ్యాపారులను రోడ్డున పడేయవద్దు 

 టీడీపీ నాయకుల హెచ్చరిక


నరసాపురం, సెప్టెంబరు 28 : ప్రజలు ఓటేసి గెలిపించిన నియోజకవర్గం కంటే...  ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సొంత నియోజకవర్గం పాలకొల్లుపైనే ఇటీవల కాలంలో ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విమర్శించారు. పట్టణ వ్యాపారులకు మద్దతుగా మంగళవారం చేసిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. నరసాపురానికి కేటాయించిన మెడికల్‌ కాలేజీని పాలకొల్లుకు తరలించారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్కెట్‌లోని వ్యాపారులు తనకు ఓటు వేయలేదన్న భావన ఎమ్మెల్యేలో నెలకొందన్నారు. ఈ కారణం చేత కరోనా కష్టంలోనూ వ్యాపారుల విన్నపాలను సైతం పక్కనబెట్టి ఆక్రమణల పేరుతో ఇబ్బం దులకు గురి చేశారన్నారు. తాజాగా అల్లూరి కాంప్లెక్స్‌ కూల్చివేతకు సిద్ధమయ్యార న్నారు. నిధుల్లేకుండా కాంప్లెక్స్‌ కూలిస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమా దం ఉందన్నారు. గడచిన రెండేళ్లలో ఆర్టీసీ బస్టాండ్‌కు తప్ప ఎమ్మెల్యే  నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చిందేమీ లేదన్నారు. హార్భర్‌, 216 జాతీయ రహదారి తన హయాంలోనే తెచ్చానన్నారు.దీనిపై తాను ఏ చర్చకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.సమావేశంలో టీడీపీ నాయకులు చిటికెల రామ్మో హన్‌, బళ్ళ మూర్తి, అంబటి ప్రకాష్‌, రెడ్డిం శ్రీను, నరేంద్ర, పట్నాల జగన్‌, కరిచర్ల ఈశ్వర్‌, తాతాజీ, పులపర్తి దత్తు వ్యాపారులు పాల్గొన్నారు. 


వ్యాపారులకు అండగా టీడీపీ : పొత్తూరి


నరసాపురం టౌన్‌, సెప్టెంబరు 28 : నిధుల్లేకుండా కాంప్లెక్స్‌ను కూల్చడం సరికా దని.. వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు,కొవ్వలి నాయుడు అన్నారు.పార్టీ శ్రేణులతో అల్లూరి కాంప్లెక్స్‌ను మంగళ వారం సందర్శించి వ్యాపారులు కొండవీటి నాగేశ్వరరావు, పోలిశెట్టి సాంబతో చర్చిం చారు.కాంప్లెక్స్‌ నిర్మించి 20 ఏళ్లు కాలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఖాళీ చేయించేం దుకు శిఽథిలావస్థ సాకు చూపిస్తున్నారన్నారు. మరొక సంస్థ చేత భవన నాణ్యతను టెస్టింగ్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారులకు భరోసా కల్పించి తొలగిస్తే అభ్యంతరం లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రత్నమాల, కొప్పాడ రవి, పాలూరి బాబ్జి, కొల్లు పెద్దిరాజు,అనంత రామా రావు, నాగబాబు, కాగిత వెంకటేశ్వరరావు, షేక్‌ హుస్సేన్‌, కోటిపల్లి ఆనందరావు, భూప తి నరేష్‌, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-09-29T05:47:27+05:30 IST